Benefits of Lakshmi Narayan Yog:  ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. గ్రహాల సంచారం వల్ల శుభ మరియు అశుభ యోగాలు ఏర్పడతాయి. ఇవి కొందరికి శుభంగా, మరికొందరికి అశుభంగా ఉంటాయి. ఇవాళ శుక్రుడు, రేపు బుధుడు తమ తమ రాశులను మార్చనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెల మూడో వారంలో అంటే జూలై 25న సింహరాశిలో శుక్రుడు, బుధుడు కలయిక జరగబోతుంది. దీని కారణంగా అరుదైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతుంది. ఆస్ట్రాలజీలో దీనిని చాలా శుభకరమైన యోగంగా భావిస్తారు. ఈ యోగం ఆగస్ట్ 7 వరకు ఉంటుంది. ఆగస్టు 7వ తేదీ ఉదయం 10.37 గంటలకు శుక్రుడు కన్యారాశిలో సంచరించడం వల్ల లక్ష్మీనారాయణ యోగం సమాప్తమవుతుంది. ఈ పవిత్రమైన యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


మిధునరాశి
మిథునరాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం శుభఫలితాలను ఇవ్వనుంది. మీరు ధనలాభం పొందే అవకాశం ఉంది. మీరు కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు రుణవిముక్తి పొందుతారు. జూలై 25 నుండి ఆగస్టు 7 వరకు ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ మాటలతో ప్రజలను ఆకట్టుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 


కన్య రాశి
లక్ష్మీ నారాయణ యోగం కన్యా రాశి వారికి కలిసి రానుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. మీరు పాతపెట్టుబడుల ద్వారాప్రయోజనం పొందుతారు. మీ కుటుంబం కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 


తులారాశి
తులరాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం వరం. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లబిస్తుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు. 


Also Read: Shukra Mangal yuti 2023: సింహరాశిలో శుక్రుడు, కుజుడు కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి