Shukra-Budh Yuti 2023:  వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తోంది. కాలానుగుణంగా ఈ ఫ్లానెట్స్ ఇతర గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. గ్రహాల రాకుమారుడైన బుధుడు మార్చి 31న మేష రాశిలో సంచరించబోతున్నాడు. ఇప్పటికే అదే రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మేష రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారికి మంచి రోజులు ప్రారంభంకానున్నాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్మీనారాయణ యోగం ఈ రాశులకు వరం
కర్కాటక రాశి
లక్ష్మీ నారాయణ యోగం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు పనిలో విజయం దక్కుతుంది. మీరు కెరీర్ లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
సింహరాశి 
ఈ రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం మేలు చేస్తుంది. మీ రాశి యెుక్క తొమ్మిదో ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. మీకు పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ మరియు వ్యాపార పరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు ప్రస్తుతం పని చేస్తున్న ప్రాజెక్ట్‌లలో విజయం సాధిస్తారు. మీరు భారీగా డబ్బును సంపాదిస్తారు. 
మిధునరాశి
లక్ష్మీ నారాయణ యోగం మిథున రాశి వారికి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీ రాశికి చెందిన ఆదాయ గృహంలో ఈ యోగం ఏర్పడబోతోంది. మీ ఆదాయానికి కొత్త వనరులు ఏర్పడతాయి. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వ్యాపారంలో విపరీతమైన లాభం ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. 


Also Read: Sri Rama Navami 2023: రేపే శ్రీరామ నవమి... శుభ ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి