Laxmi Narayan Rajyog in Makar 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తుంది. రేపు అంటే డిసెంబర్ 28న బుధుడు మకర రాశిలో సంచరించనున్నాడు. అనంతరం డిసెంబరు 29న శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కేప్రికాన్ లో ఈ రెండు రాశుల కలయిక వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని పవిత్రమైన యాగంగా భావిస్తారు. డిసెంబరు 29న ఏర్పడనున్న ఈ యోగం కారణంగా కొందరికి గోల్డెన్ డేస్ రానున్నాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): బుధ, శుక్రుల కలయికతో ఏర్పడే లక్ష్మీ నారాయణ రాజయోగం మేష రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా  ఉంటుంది. ఏదైనా పనిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. 
మిథునం (Gemini): డిసెంబర్ 29 నుండి ఏర్పడుతున్న లక్ష్మీ నారాయణ రాజయోగం మిధున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో మతపరమైన పనులు చేయవచ్చు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. మీకు సమయం ఆనందంగా  ఉంటుంది.


తుల (Libra): బుధ, శుక్రుల రాశి మార్పు కూడా తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. 
వృశ్చికం (Scorpio): బుధ, శుక్రుల సంచారం వల్ల ఏర్పడిన లక్ష్మీ నారాయణ రాజయోగం వృశ్చిక రాశి వారికి మనశ్శాంతిని ఇస్తుంది. మతపరమైన పనుల పట్ల మొగ్గు ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. 


Also Read: Rahu Gochar: 2023లో రాహు గోచారం.. ఈ రాశుల అదృష్టం మారడం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.