Trigrahi Yog 2023: సంపద, తెలివితేటలు మరియు వ్యాపారాలను ప్రసాదించే బుధ గ్రహం ఇవాళ మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే సూర్యభగవానుడు, బృహస్పతి అదే రాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సూర్యుడు, గురుడు మరియు బుధుడు కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని ఆస్ట్రాలజీలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. జాతకంలో త్రిగ్రాహి యోగం ఉన్నవారు అపారమైన పురోగతి సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్రిగ్రాహి యోగం ఈ రాశులకు వరం
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి త్రిగ్రాహి యోగం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు కెరీర్‌లో అపారమైన పురోగతి సాధిస్తారు. కొత్త జాబ్ ఆఫర్ పొందుతారు. ఉద్యోగస్తులు పదోన్నతి పొందుతారు. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఇతరులతో సంబంధాలు బాగుంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు పరీక్ష, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. 
ధనుస్సు: సూర్యుడు, గురు, బుధ గ్రహాల కలయికతో ఏర్పడిన త్రిగ్రాహి యోగం ధనుస్సు రాశి వారికి గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీరు కొత్త ఇల్లు, వాహనం, బట్టలు-నగలు లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ యెుక్క ఆస్తి వివాదాలు ముగుస్తాయి. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. 
మీనం: త్రిగ్రాహి యోగం మీనరాశిలో మాత్రమే ఏర్పడుతోంది. దీంతో మీరు శుభఫలితాలను పొందుతారు. మీరు అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. మీనరాశి వారు ఇతరులను ఆకర్షిస్తారు. మీరు ఏదైనా పని లేదా వ్యాపారం మెుదలుపెట్టడానికి ఇదే అనుకూల సమయం. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితం బాగుంటుంది.


Also Read: Sun transit 2023: ఈ 4 రాశుల అదృష్టాన్ని తిరగరాయనున్న సూర్యుడు, అంతులేని ధనం మీ సొంతం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook