Mercury Transit In Scorpio 2022: జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహాన్ని గ్రహాల రాకుమారుడిగా పిలుస్తారు. ఎవరి జాతకంలో బుధుడు బలంగా ఉంటాడో.. ఆ వ్యక్తుల మాటలు మిమ్మల్ని  ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా వీరు వ్యాపారంలో నైపుణ్యం కలిగి ఉంటారు. నవంబర్ 13న బుధ గ్రహం వృశ్చిక రాశిలోకి (Mercury Transit In Scorpio 2022) ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులవారిపైనా కనిపిస్తుంది. వృశ్చికరాశిలో బుధుడి సంచారం ఏ రాశులకు శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీనం (Pisces): బుధ గ్రహం యొక్క సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో జరగబోతోంది. అందువలన, మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం నిమిత్తం చేసే ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే మంచి సమయం. 


కన్య (Virgo): బుధుడు రాశిచక్రం మారడం కన్య రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి మూడవ ఇంట్లో జరుగుతోంది. దీని కారణంగా ధైర్యం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునవారి కల నెరవేరుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఈ రాశికి అధిపతి బుధుడే కాబట్టి ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. 


కర్కాటకం (Cancer): వృశ్చికరాశిలో మెర్క్యురీ సంచారం వ్యాపారం మరియు వృత్తి పరంగా మీకు అనేక లాభాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి యెుక్క  ఐదో ఇంట్లో జరగబోతోంది. మీరు బిజినెస్ లో మంచి లాభాలను సాధిస్తారు. వ్యాపారం విస్తరిస్తుంది. ఈ సమయంలో మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు. విద్యారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభపడతారు. 


Also Read: Shukra Gochar 2022: శుక్ర సంచారం వల్ల ఆ రాశులవారికి ఈ నెల 20 వరకు డబ్బే..డబ్బు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook