Mercury transit 2022: శుక్రుడి రాశిలో సంచరిస్తున్న బుధుడు.. ఈ మూడు రాశులవారికి కష్టాలు...
Mercury transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం తులారాశిలో సంచరించింది. మెర్క్యురీ గ్రహం యొక్క ఈ సంచారం 3 రాశుల వారికి సమస్యలను కలిగిస్తుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar In Tula 2022: పంచాంగం ప్రకారం, బుధ గ్రహం అక్టోబర్ 26న తులారాశిలో సంచరించింది. బుధ గ్రహం.. మేధస్సు, వ్యాపారం మరియు గణిత శాస్త్రానికి కారకుడిగా భావిస్తారు. మెర్క్యూరీ సంచారం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. తులరాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు, బుధుడు స్నేహితులు. శుక్రుడి యెుక్క రాశిలో బుధుడి సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటే.. మరికొందరికి ఇబ్బందులను కలిగిస్తుంది. బుధుడి యెుక్క రాశి మార్పు ఏ రాశులవారికి సమస్యలను తెస్తుందో తెలుసుకుందాం.
ఈ మూడు రాశులకు కష్టాలు
వృషభం (Taurus): బుధుడి సంచారం ఈ రాశివారికి కొంత బాధను కలిగిస్తుంది. ఈరాశి యెుక్క ఆరో ఇంట్లో బుధుడి సంచారం జరుగుతుంది. ఇది వ్యాధి మరియు శత్రువు యెుక్క ప్రదేశంగా భావిస్తారు. అందువల్ల ఈ రాశివారు శత్రువుల పట్ల అప్రమత్తతో మెలగాల్సి ఉంటుంది. లావాదేవీలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఒపల్ రాయిని ధరించడం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది.
వృశ్చికరాశి (Scorpio): బుధుడు రాశి మార్పు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో 12వ ఇంట్లో బుధుడు సంచరించాడు. ఇది ప్రయాణ ప్రదేశంగా పరిగణిస్తారు. దీంతో మీరు వ్యాపారంలో భారీగా నష్టపోవచ్చు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీంతో మీరు ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కోర్టు కేసుల్లో ఓడిపోతారు. ఆఫీసులో మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి.
మీనం (Pisces): మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో బుధుడు సంచరించాడు. ఇది జ్యోతిషశాస్త్రంలో వయస్సు మరియు వ్యాధి యొక్క ప్లేస్ గా భావిస్తారు. అందువల్ల ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఈ టైంలో మీరు గాయపడే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా నడపండి.
Also Read: Malavya Yog: శుక్రుడి యెుక్క మాళవ్య రాజయోగం.. ఈ 3 రాశులవారికి ఊహించనంత ధనం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి