Budh Vakri In Dhanu:  కొత్త సంవత్సరం వచ్చేసింది. మరి ఈ ఏడాది ప్రారంభంలో భూమికి లక్షలాది మైళ్ల దూరంలో ఉన్న గ్రహాలు కూడా తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. గ్రహాల రాకుమారుడైన బుధుడు డిసెంబరు 30 రాత్రి 11.07 గంటలకు ధనుస్సు రాశిలో తిరోగమనం చేశాడు. మళ్లీ ఇతడు జనవరి 18న ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. అనంతరం బుధుడు ఫిబ్రవరి 7న సూర్యుడిని మకరరాశిలో కలుస్తారు. ధనుస్సు రాశిలో బుధుడు తిరోగమనం వల్ల కొత్త ఏడాదిలో 5 రాశులవారికి చెడు రోజులు మెుదలవుతాయి. వీరు వ్యాపారం నుండి కెరీర్ వరకు అన్నింటా ఇబ్బందులను ఎదుర్కోంటారు. మెర్క్యూరీ తిరోగమనం ఏయే రాశులవారిని ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries): బుధుడి తిరోగమనం వల్ల మీకు అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి జీవితం మందగిస్తుంది. ఆదాయ వ్యయాల మధ్య అసమతుల్యత పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. మీరు ఉద్యోగం మారడానికి ఇది సరైన సమయం కాదు. వ్యాపారాలు చేసే వారు శత్రువుల నుండి అడ్డంకులు ఎదుర్కోంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. . ఆదివారాలు పేదలకు భోజనం పెట్టడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
వృషభం (Taurus): మెర్క్యూరీ తిరోగమనం వల్ల ఈ ఏడాది ప్రారంభంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కోంటారు. ఆఫీసులో సహోద్యోగులతో మనస్పర్థలు రావచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ కోసం వేచి చూడాల్సి వస్తుంది. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా నష్టపోతారు. ప్రేమ జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. బుధవారం ఆవుకు పాలకూర తినిపించడం శుభప్రదంగా భావిస్తారు. 
సింహరాశి (Leo): మీరు అనారోగ్యానికి గుర్యయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుండదు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు చెడిపోతాయి. పని ఎక్కువ అవ్వడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభాలు తక్కువగా ఉంటాయి. బుధవారం ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. 


వృశ్చిక రాశి (Scorpio): ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదం రావచ్చు. మీ కళ్ళను జాగ్రత్తగా చూసుకోండి మరియు తెలివిగా డబ్బు ఖర్చు చేయండి. వృత్తి జీవితం నిరాశ కలిగిస్తుంది. వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. బుధవారం అమ్మాయిలకు స్వీట్లు తినిపించడం మంచిది. 
మకరరాశి (Capricorn):  బుధుని గమనం వల్ల మీ వృత్తి జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆఫీసులో సహోద్యోగులతోనూ, పెద్దలతోనూ విభేదాలు రావచ్చు. శ్రమకు ప్రశంసలు లభించవు. భాగస్వామితో గొడవలు తలెత్తుతాయి. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాసం ఉంది. వ్యాపారంలో మీరు అనుకున్న లాభాలు రాకపోవచ్చు.  


Also Read: New year 2023: న్యూ ఇయర్ తొలి రోజున ఇవి తింటే.. ఏడాదంతా లక్కే లక్కు... డబ్బే డబ్బు .. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U  


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.