Budhaditya Rajyog: మే 10న బుధాదిత్య రాజ్యయోగం ఏర్పాటు.. ఈ రాశులవారికి లాభాలే లాభాలు!
Budhaditya Rajyog in Aries 2024: మేషరాశిలో బుధాదిత్య రాజ్యయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో అనుకున్న పనులు కూడా జరుగుతాయి. దీంతో పాటు నిలిపోయిన పనులు కూడా పరిష్కారమవుతాయి.
Budhaditya Rajyog in Aries 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా శుక్ర, శని, గురు గ్రహాలకు జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. అయితే మే 10వ తేదిన గ్రహాలకు రాకుమారుడి భావించే బుధుడు కూడా సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఇప్పటికే మేష రాశిలో సూర్యుడు ఉండడంతో రెండు గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలతో పాటు అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బుధాదిత్య రాజయోగం అంటే ఏంటో తెలుసా?:
సాధరణంగా ఈ యోగం బుధుడు ఎదైన గ్రహంతో కలవడం వల్ల ఏర్పడుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో బుధుడు, సూర్యుని కలయిక కారణంగా కూడా ఏర్పడుతూ ఉంటుంది. దీని కారణంగా జాతకంలో ఈ యోగం శుభస్థానంలో ఉన్నవారికి వత్తిపరమైన జీవితంలో అనేక ప్రయోజనాలు, ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు స్నేహితుల నుంచి కూడా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రాశులవారికి న్యాయపరమైన విషయాల్లో వస్తున్న సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది.
మేష రాశి:
బుధాదిత్య రాజయోగం కారణంగా మేష రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. వృత్తి జీవితంలో వస్తున్న సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా నిలిపోయిన పనులు కూడా సులభంగా జరిగిపోతాయి. వీరికి సమాజంలో హోదా, గౌరవం, కీర్తి, ప్రతిష్టలు కూడా లభిస్తాయి. దీంతో పాటు వ్యాపారాల్లో వస్తున్న సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అలాగే వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం లభించే ఛాన్స్ కూడా ఉంది.
సింహ రాశి:
ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా సింహ రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో పురోగతి కూడా లభిస్తుంది. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా శుభవార్తలు వినే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి అనేక రకాల ప్రయోజానాలు కలుగుతాయి. దీంతో పాటు కుటుంబంలో శుభకార్యాలు జరిగే ఛాన్స్ కూడా ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
తుల రాశి:
తుల రాశివారికి కూడా ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. వస్తు సౌఖ్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కెరీర్ సంబంధించిన పురోగతి కూడా లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి