Budhaditya Rajyog: ప్రతి గ్రహం ఒక ప్రత్యేక సమయంలో మాత్రమే సంచారం చేస్తూ ఉంటుంది. అన్ని గ్రహాలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాలు సంచారం, తిరోగమనం చేసినప్పడు శుభ, అశుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే  ఈ ప్రభావాలే వ్యక్తుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 2024 సంవత్సంలోని రెండవ నెల ఫిబ్రవరిలో బుధ, సూర్య గ్రహాల కలయిక జరబోతోంది. ఈ సంయోగం కుంభరాశిలో జరుగబోతోంది. కాబట్టి ఈ గ్రహాల కలయిక వల్ల 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఈ 'బుధాదిత్య రాజయోగం' ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునరాశి:
మిథున రాశి వారికి బుధాదిత్య రాజయోగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అదృష్టం కూడా పెరుగుతుంది. దీని కారణంగా వ్యాపారాల్లో పెట్టబడులు పెట్టి ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు వీరిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారికి ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టపడి చదవడం వల్ల మంచి లాభాలు పొందుతారు. జాబ్ కోసం ఎదురు చూస్తున్నవారికి పేరున్న ఆఫీస్‌ల నుంచి ఆఫర్స్‌ పొందుతారు. దీంతో పాటు కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. 


తులారాశి:
తుల రాశివారికి ఈ  రాజయోగం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మంచి సంబధాలు ఏర్పడతాయి. జీవితంలో విజయాలు సాధించేందుకు ఇదే సరైన సమయంగా భావించవచ్చు.  మానసిక ఒత్తిడి నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. దీంతో పాటు ఎలాంటి కఠినతరమైన పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా పెట్టబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. 


Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


కుంభ రాశి:
కుంభ రాశి వారిపై కూడా ఈ శుభయోగం శుభప్రదం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సమయంలో మీకు నచ్చినట్లు జీవించగలుగుతారు. న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడగలరు. కుటుంబ జీవితంలో అనేక మార్పులు వచ్చి..సంతోషకరమైన జీవితం లభిస్తుంది. ఈ సమయంలో మీ కష్టం పని చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా చాలా లాభాలు పొందుతారు. ఒంటరిగా ఉన్న వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter