Budhaditya Rajyog In Capricorn: గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్తూ రాజయోగాలను ఏర్పరుస్తాయి. మకరరాశిలో బుధాదిత్య రాజ్యయోగం ఏర్పడింది. గ్రహాల రాజు సూర్యుడు మరియు గ్రహాల రాకుమారుడు బుధుడు కలయిక వల్ల ఈ యోగం (Budhaditya Rajyog ) ఏర్పడుతుంది. బుధాదిత్య రాజయోగం కారణంగా మూడు రాశులవారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం
బుధాదిత్య రాజయోగం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది.  ఎందుకంటే మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. అందువల్ల పరిశోధన రంగంలో నిమగ్నమైన వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే దాని నుండి బయటపడతారు. ఉద్యోగులు కావాల్సిన చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. 
తులా రాశిచక్రం
బుధుడు, సూర్యుడు కలయిక వల్ల ఏర్పడిన యోగం కారణంగా తుల రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకంటే మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ సమయంలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. మీ లైఫ్ లో సుఖాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. 
ధనుస్సు రాశిచక్రం
బుధాదిత్య రాజయోగం మీకు ఆర్థికంగా లాభాలను  ఇస్తుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ మాటలతో ఇతరులను ఆకర్షిస్తారు. ఆఫీసులో మీకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది.


Also Read: Guru Uday 2023: 'హంస రాజయోగం' చేస్తున్న గురుడు... ఈ 3 రాశులవారి కెరీర్ దూకుడు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook