Budhaditya Yoga 2023: సూర్యుడు-బుధుడు గ్రహాల కలయిక.. ఫలితంగా బుధాదిత్య యోగం.. ఈ రాశులకు కోలుకోలేని నష్టం
Mercury-Sun Conjunction: బుధాదిత్య యోగం కారణంగా ఈ కింది రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.
Mercury-Sun Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కూటమిగా ఏర్పడడానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఇలా జరగడం కారణంగా మొత్తం 12 రాశిచక్రాలపై గ్రహాల సంయోగాలు వేర్వేరు ప్రభావాలను చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ నెలలో వృషభరాశిలో సూర్యుడు, బుధుడు కలవబోతున్నాడు. దీని కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం చాలా పవిత్రమైనది.
బుధాదిత్య యోగం ఎప్పుడు ఏర్పడుతుంది?
జూన్ 07న బుధుడు వృషభ రాశిలోకి సంచారం చేసినప్పుడు. సూర్యుడు కూడా ఇదే క్రమంలో అదే రాశిలోకి సంచారం చేస్తే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల చాలా రాశులవారి జీవితాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. ముఖ్యంగా బుధాదిత్య యోగం కారణంగా అన్ని రాశులవారి జీవితాల్లో చాలా రకాలు మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా పలు రాశులవారిపై తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారాల కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్ జట్టులో ఉండాల్సిందే..!
మేషరాశి:
బుధుడు వృషభరాశిలోకి ఆ రెండు రాశులు సంచారం చేసినప్పుడు మేషరాశి వారికి జీవితంలో తీవ్ర మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారికి జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. అంతేకాకుండా వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మేషరాశివారికి ఆర్థిక సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఖర్చులు పెరిగి..ఆదాయం తగ్గొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మిథున రాశి:
సూర్య-బుధ సంయోగం మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం లోపించి తీవ్ర సమస్యల్లో చిక్కుకుంటారు. ఈ రాశివారు జీవితంలో మార్పుల కారణంగా తీవ్ర సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరికి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోతారు. అంతేకాకుండా ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి రుణాలు తీసుకునే అవకాశాలున్నాయి. వ్యాపారాలు చేస్తున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ యోగం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. మారుతున్న వాతావరణం వీరు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. బుధుడు వృషభరాశిలోకి సంచారం చేయడం వల్ల వీరి జీవితంపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా ఈ రాశివారికి మానసిక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా వృత్తి జీవితంలో సవాళ్లు ఎదురవుతాయి. కాబట్టి వీరు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్ జట్టులో ఉండాల్సిందే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి