Camphor Power: కర్పూరం జీవితాన్నే మార్చుతుంది.. ఇలా చేస్తే దరిద్రం పోయి ధనవంతులు అవ్వడం ఖాయం!
Camphor Removes Negativity: ఇంట్లో ప్రతిరోజు కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ప్రతిరోజు కర్పూరాన్ని వెలిగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Camphor Removes Negativity In Telugu: కర్పూరాన్ని చాలామంది దేవుడి పూజలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు ముఖ్యంగా కర్పూరంలో వివిధ రకాలుంటాయి. ఇందులో తెల్ల కర్పూరం ఒకటైతే రెండవది పచ్చ కర్పూరం. ఈ పచ్చ కర్పూరం ఎక్కువగా ఆహారాల్లో వినియోగిస్తూ ఉంటారు. అలాగే దీనిని ఆయుర్వేద మూలికల తయారీలో కూడా ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను సైతం తొలగిస్తాయి. ఇక తెల్ల కర్పూరం విషయానికొస్తే ప్రతి పూజలో భాగంగా దీనిని వినియోగిస్తూ ఉంటారు. ఇది అద్భుతమైన సువాసనతో ఉంటుంది. అంతేకాకుండా మంచి సువాసనను కలిగిన పొగనందిస్తుంది. అయితే ఈ తెల్ల కర్పూరాన్ని ఇంట్లో వెలిగించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కర్పూరం లో ఉండే గుణాలు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించేందుకు కూడా సహాయపడతాయట. అయితే ఈ కర్పూరాన్ని ఇంట్లో ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సనాతన ధర్మంలో కర్పూరం గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు దీనితో అనేక రకాల పరిహారాలు చేయవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. కర్పూరాన్ని ఇంట్లో వెలిగించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని వారంటున్నారు. ముఖ్యంగా ఎప్పుడు అనేక సమస్యలతో సమస్యలతో బాధపడుతున్న వారు వీటి నుంచి విముక్తి పొందడానికి కర్పూరం చాలని వారంటున్నారు. నిజానికి కర్పూరాన్ని ఇంట్లో వెలిగించడం వల్ల అద్భుతం జరుగుతుందా? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతిరోజు ఇంట్లో ఉదయం సాయంత్రం పూట కర్పూరాన్ని వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందట. అంతేకాకుండా పాజిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట. అలాగే రోజు కర్పూరాన్ని వెలిగించడం వల్ల కొన్ని సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుందట.
ప్రస్తుతం చాలామంది కుటుంబాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలా అప్పుడప్పుడు గొడవలు జరగడం కామన్ అయినప్పటికీ.. కొంతమంది కుటుంబాల్లో తరచుగా ఉదయం నుంచి రాత్రి వరకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇలా జరగడానికి నెగిటివ్ ఎనర్జీ కారణమని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఇలా జరగకుండా ఉండడానికి కర్పూరం రెమెడీ ఎంతగానో పనిచేస్తుందట. దీనికోసం పెద్దగా చేయనక్కర్లేదు.. కేవలం రోజుకు రెండుసార్లు ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే చాలట. ప్రతిరోజు ఇంట్లో కర్పూరాన్ని రెండు పూటలు వెలిగించడం వల్ల ఇల్లు, కుటుంబం ఎంతో సంతోషంగా పది కాలాలపాటు వర్ధిల్లుతుందట. అంతేకాకుండా గొడవలు కూడా తొలగిపోతాయి.
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
కొంతమంది ఇళ్లలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరగడం కారణంగా ఎలాంటి పనులు చేసిన కంప్లీట్ అవ్వకుండా ఉంటాయి. అలాగే మానసిక ప్రశాంతత కూడా ఉండదు. అంతేకాకుండా తరచుగా ఎలాంటి పనులు చేసిన సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఎలాంటి కార్యాలు తలపెట్టిన ఆగిపోతూ ఉంటాయి.. వీటన్నిటి నుంచి విముక్తి పొందడానికి కర్పూరాన్ని వినియోగిస్తే చాలు. కర్పూరాన్ని ఉదయం సాయంత్రం పూట వెలిగిస్తే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అలాగే కొంతమంది ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించిన ధనం నిల్వకుండా ఉంటుంది. అంతేకాకుండా సంపాదించిన దానికంటే ఎక్కువగా ఖర్చవుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా కర్పూరం రెమిడి ఎంతగానో సహాయపడుతుంది.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.