Chanakya Niti about money: ఆచార్య చాణిక్యుడు (acharya chanakya) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇతడి కీర్తి అలాంటిది. ఈయననే కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని పిలుస్తారు. చాణక్యుడి సలహాలతోనే చంద్రగుప్త మౌర్యుడు నంద వంశానికి రాజు అయ్యాడు. ప్రపంచంలోని కొద్ది మంది గొప్ప పండితుల్లో చాణిక్యుడు ఒకరు. ఆయన తన జీవితంలో ఎదురైనా అనుభవాలను చాణక్య నీతిలో (Chanakya Niti) వివరించారు. చాణక్యుడికి ఆర్థిక, సామాజిక, రాజకీయ శాస్త్రాల్లో అపారమైన జ్ఞానం ఉంది. చాణిక్యుడు అనేక గ్రంథాలను రచించాడు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏయే ఆంశాలు పాటించాలో తన చాణక్య నీతిలో ఆయన వివరించారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాణిక్యుడి ప్రకారం, ఆహార నిల్వలు నిండుగా ఉన్న ఇంట్లో తల్లి లక్ష్మి (Goddess Lakshmi) నివశిస్తుంది. తిండి కొరత ఉన్న ఇంట్లో అమ్మవారు ఉండదు. అందుకే కష్టపడి పనిచేసి తిండికి లోటు లేకుండా చూసుకోండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య విభేదాలు లేని ఇంట్లో కూడా తల్లి లక్ష్మీ ఉంటుంది. ఆలు మెుగలు ప్రేమతో కలిసి మెలిసి ఒకే ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుందని అర్థం చేసుకోండి. మూర్ఖులకు స్థానం లేని ప్లేస్ లో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చాణిక్యుడు చెప్పాడు.  అందరికీ సహాయం చేసేవారిపై, డబ్బును సద్వినియోగం చేసుకునేవారిపై, ఇతరుల పట్ల కృతజ్ఞతా భావాన్ని మనసులో కలిగి ఉండే వారిపై లక్ష్మిదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. 


Also Read: Mercury Rising: జూలై 29న కర్కాటకంలో ఉదయించనున్న బుధుడు... ఈ 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ మెుదలు! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook