Chanakya niti for happy life: ఆచార్య చాణక్యుడు భారతదేశంలోనే మాత్రమే కాదు, ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక వేత్త. ఇతను తన తెలివితో పిల్లవాడైన చంద్రగుప్త మౌర్యుడును మెుత్తం దేశానికే చక్రవర్తిగా చేశాడు. మనిషి విజయవంతమైన జీవితం కోసం అనేక విషయాలను తన చాణక్య నీతిలో పొందుపరిచాడు. వృత్తి, స్నేహం, వైవాహిక జీవితం, సంపద మరియు స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలను చాణక్యుడు తన నీతిలో పేర్కొన్నాడు. అంతేకాకుండా స్త్రీ, పురుషుల వైవాహిక జీవితం గురించి అనేక విషయాలు ప్రస్తావించారు. అయితే పెళ్లైన తర్వాత భర్తలు తమ భార్యకు కొన్ని విషయాలను చెప్పకూడదని ఆయన తన గ్రంథంలో వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. సంపాదన 
భర్త సంపాదన గురించి ఎప్పుడూ భార్యకు చెప్పకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. స్త్రీలు తమ భర్త సంపాదన గురించి తెలుసుకుంటే, ఆమె వాటిని ఖర్చు చేయకుండా ఆపుతుందని ఆయన వివరించారు. 


2. అవమానం
పురుషులు తమకు జరిగిన అవమానాల గురించి భార్య వద్ద ఎప్పుడూ ప్రస్తావించ వద్దని చాణక్యుడు చెప్పాడు. ఈ విషయం చెప్పడం వల్ల మిమ్మిల్ని మీ భార్య అవమానించే అవకాశం ఉంది. 


3. బలహీనత
భర్త తన బలహీనత గురించి భార్యకు ఎప్పుడూ చెప్పకూడదని చాణక్య చెప్పాడు. భర్త బలహీనత గురించి భార్యకు తెలిస్తే.. ఆమె తన భర్తతో ఆడుకుంటూ ఉంటుంది.  


4. దాతృత్వం
కుడి చేతితో దానం చేస్తే.. ఎడమ చేతికి తెలియకూడదంటారు. అదేవిధంగా, మీరు ఎవరికైనా విరాళం ఇచ్చినప్పుడు లేదా ఆర్థికంగా సహాయం చేసినప్పుడు, దాని గురించి మీ భార్యకు అస్సలు చెప్పకండి. భవిష్యత్తులో ఆమె ఈ పని చేయకుండా మిమ్మల్ని ఆపే అవకాశం ఉంది.


Also Read: Halharini Amavasya 2022: హలహరిణి అమావాస్య ఎప్పుడు? ఇది రైతులకు ఎందుకు ప్రత్యేకం?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.