Chanakya Niti: పెళ్లికి ముందు జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసా?
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పెళ్లికి ముందు జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవాల్సిన విషయాల గురించి సవివరంగా వివరించారు.
Chanakya niti for Marriage: చాణక్య నీతిలో (Chanakya Niti) ఆచార్య చాణక్యుడు లైఫ్ సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని మెలిగినప్పుడే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందన్న చాణక్యుడు.. పెళ్లికి ముందు జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవాల్సిన విషయాల గురించి సవివరంగా వివరించారు.
1. గుణాలను చూడండి
పెళ్లికి ముందు అబ్బాయి మరియు అమ్మాయిలో చూడవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వారి గుణం ఎలా ఉందో చూడాలన్నారు. అందం కంటే వ్యక్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
2. కోపాన్ని పరీక్షించండి
కోపమే మనిషికి పరమ శత్రువు అని అంటారు. మితిమీరిన కోపం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. అందుకే పెళ్లికి మందు మీ పార్టనర్ యెుక్క కోపాన్ని పరీక్షించాలి.
3. జీవిత భాగస్వామి గురించి తెలుసుకోండి
ప్రతి వ్యక్తికి మతం కూడా అవసరం. పెళ్లికి ముందు ఏ అమ్మాయి అయినా, అబ్బాయి అయినా తమ జీవిత భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
4. గౌరవంగా ఉండండి
పెళ్లికి ముందు ఏ అబ్బాయిలోనైనా, అమ్మాయిలోనైనా ఆ వ్యక్తి అందరినీ గౌరవిస్తాడో లేదో కూడా చూడాలి. ఎందుకంటే గౌరవించని వ్యక్తికి కూడా గౌరవం లభించదు. ఏది ఇస్తే అది పొందుతాడు అంటారు. అందువల్ల, మీ రాబోయే పార్టనర్ లో ఇలాంటి లక్షణాలు ఉన్నాయో లేదో చూడాలి.
Also Read: Shani Dev: మనపై శని దేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది? తెలుసుకోవడం ఎలా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook