Chandra Grahan 2022: మరో 14 రోజుల్లో రెండో గ్రహణం.! ఈ రాశుల మారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.. తస్మాత్ జాగ్రత్త..
Chandra Grahan 2022 Date Time: చంద్ర గ్రహణం వల్ల 12 రాశులపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రతులు తీసుకోవడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది.
Chandra Grahan 2022 Date Time: ఈ సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం నవంబర్ 8న ఏర్పడబోతోంది. అయితే జ్యోతిషశాస్త్రంలో గ్రహణం వల్ల మానవులకు దుష్ర్పభావాలు జరిగే అవకాశాలన్నాయి కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మొన్నె సూర్యగ్రహణం ముగిసిన వెంటనే ఈ చంద్రగ్రహణం రావడం చాలా విశేషం. ఇప్పుడు నవంబర్ 8 న చంద్రగ్రహణం సంభవించబోతోంది. అయితే ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలు పాటించడం వల్ల చంద్రగ్రహణం వల్ల ఏర్పడే ప్రభావవం మనుషులపై పడకుండా ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
చంద్రగ్రహణం పౌర్ణమి రాత్రి ఏర్పడబోతోంది:
పౌర్ణమి రాత్రి సూర్యుడు, చంద్రుడు ఒకే రేఖలోకి రాబోతున్నాయి. అయితే ఇలా ఒకే రేఖలోకి రావడం వల్లే చంద్రగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంతో సూర్యుడి నీడ చంద్రునిపై పడడం వల్ల ఆకర్షణీయమైన చంద్రగ్రహణం ఏర్పడబోతోందని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చంద్రగ్రహణమే మే 15న ఏర్పడింది. కానీ దీని ప్రభావవం అంతగా లేకపోయింది. అయితే ఈ నవంబర్ 8 ఏర్పడబోయే చంద్రగ్రహణం వల్ల భారత్‌పై ఎలాంటి ప్రభావం ఏర్పడబోతోందో తెలియాల్సి ఉంది.
ఇంతకి భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించనుందా.?
నవంబర్ 8న ఏర్పడనున్న చంద్రగ్రహణం భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కనిపించే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గ్రహణం సూతక్ కాలం కూడా ప్రభావవంతంగా ఉండే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత కాలమానం ప్రకారం..ఈ గ్రహణం నవంబర్ 8, మంగళవారం సాయంత్రం 5:32 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.18 గంటలకు ముగుస్తుంది.
ఈ రాష్ట్రాలపై చంద్రగ్రహణం ఎఫెక్ట్:
ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని తూర్పు ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎక్కువగా కోల్‌కతా, సిలిగురి, పాట్నా, రాంచీ, గౌహతి ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఖాట్మండు, టోక్యో, మనీలా, బీజింగ్, సిడ్నీ, జకార్తా, మెల్‌బోర్న్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ DC, న్యూయార్క్ సిటీ, లాస్ ఏంజిల్స్, చికాగో, మెక్సికో సిటీలలో చంద్రగ్రహణం కనిపించే అవకాశాలున్నాయి.
చంద్ర గ్రహణం ప్రభావం:
చంద్ర గ్రహణం వల్ల మొత్తం 12 రాశులపై తీవ్ర ప్రభావవం పడే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం అన్ని రాశులవారికి మానసిక స్థితిపై పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని రాశుల వారు చంద్రగ్రహణం సమయంలో ఒత్తిడి, అనాలోచితం, మానసిక క్షోభను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో అన్ని రాశుల వారు పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Kalpika Ganesh Pics: కల్పిక గణేష్ హాట్ ఫొటోస్.. తెలుగమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!
Also Read: Actor Ali: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారుడిగా అలీ నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook