COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Chandra Grahan 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అన్ని గ్రహణాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఇది సమయం నుంచి పితృపక్ష కాలం కూడా మొదలవుతుంది. ఈ పితృపక్షం సెప్టెంబర్‌ 17వ తేది నుంచి మొదలై.. అక్టోబర్ 2న ముగుస్తుంది. అయితే ఇదే సమయంలో చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ పితృపక్షానికి గ్రహణం ప్రభావం పడే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ సమయంలో మీన రాశిలో చంద్రుడు ఉంటాడు. అయితే ఇప్పటికే మీన రాశిలో రాహువు గ్రహం ఉంది. కాబట్టి ఈ గ్రహాల కలయిక జరిగి ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతుంది. దీని కారణంగా చంద్రగ్రహణం సమయంలో కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.



ఈ ఏడాదిలో రాబోయే రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్‌ 18వ తేదిన ఉ. 6 గంటలకు మొదలవుతుంది. ఆ తర్వాత ఈ గ్రహణం 10:17 వరకు కొనసాగుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహణం వ్యవధి దాదాపు 6 గంటల పాటు ఉంటుంది.


వృషభ రాశి:
చంద్రగ్రహణం ప్రభావం, రాహువుతో చంద్రుడు కలయిక కారణంగా వృషభ రాశివారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కెరీర్‌ పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు గతంలో నిలిపోయిన పనులు కూడా వెంటనే పరిష్కారమవుతాయి. అలాగే వీరికి ఆకస్మిక ధన లాభాలు కలగడమే కాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. దీంతో పాటు కెరీర్‌ పరంగా కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తవుతాయి. అలాగే వీరు పూర్వీకుల ఆస్తులు కూడా పొందుతారు. అంతేకాకుండా అన్న, తమ్ముల మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. దీంతో మంచి సపోర్ట్‌ లభిస్తుంది. 


వృశ్చిక రాశి:
చంద్రుడు మీన రాశిలో రాహువుతో కలవడం వల్ల వృశ్చిక రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి విద్య, వృత్తి జీవితంలో అనుకోని విజయాలు సాధిస్తారు. అలాగే వ్యాపారాల్లో కూడా కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్లేవారు ఈ సమయంలో ఇళ్లు, కార్లు కొనుగోలు కూడా చేస్తారు. అంతేకాకుండా పట్టుదలతో పనులు చేసేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు వీరు కొత్త కార్లతో పాటు ఇళ్లు కూడా కొనుగోలు చేస్తారు. దీంతో పాటు కెరీర్‌కు సంబంధించిన విషయంలో కూడా విపరీతమైన లాభౄలు కూడా పొందగలుగుతారు. అలాగే కెరీర్‌ పరంగా కూడా గ్రాఫ్‌ కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


కుంభ రాశి:
చంద్రుడి కలయిక కారణంగా కుంభ రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి చంద్రుడి అనుగ్రహం కారణంగా ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మెరుగుపడతాయ. అలాగే కెరీర్‌ జీవితంలో కూడా బోలెడు లాభాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబంతో కూడా ఆనందకరమైన రోజులు గడుపుతారు. అలాగే జీవితం కూడా శ్రేయస్సుకరంగా ఉంటుంది. వీరికి నిలిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.


Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..! 


Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.