Chandra Grahan 2022: చంద్రగ్రహణం కారణంగా ఈ రాశి వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే అంతే సంగతి..
Chandra Grahan November 2022: కార్తీక పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతోంది కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో మేష రాశివారు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో అనారోగ్య సమస్యల పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
Chandra Grahan 2022: కార్తీక పూర్ణిమ రోజున ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం 08 నవంబర్ 2022న ఏర్పడబోతోంది. అయితే ఈ గ్రహణం ప్రభావం 12 రాశులపై తీవ్రంగా పడబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కోన్నారు. అయితే ఈ క్రమంలో తప్పకుండా అన్ని రాశులవారు పలు జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. జోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం.. గ్రహణం ప్రభావం మేషరాశిపై పడే ఛాన్స్ ఉందని.. ఈ క్రమంలో ఈ రాశి వారు తప్పకుండా మంచి ప్రయోజనాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఈ గ్రహణం సమయంలో అప్రమత్తంగా కూడా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో వీరికి అరిష్టాలు సంభవించవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి.
గ్రహణం మధ్యాహ్నం 02:39 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 6:19 గంటలకు ముగుస్తుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే చంద్రగ్రహణం సూతక కాలం తొమ్మిది గంటల కన్న ముందే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా మేషరాశి వారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మేషరాశి వారు గ్రహణం ముగిసే వరకు ఏమీ తినకూడదని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా ఉపవాసాలు పాటించి దానధర్మాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో శ్రీరాముడు, కృష్ణుడు, హనుమాన్‌కి పూజా కార్యాక్రమాలు చేయాలి. లేకపోతే చంద్ర గ్రహణం తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఈ గ్రహణం ముగిసన తర్వాత మేష రాశివారు ధరించిన దుస్తువులతోనే స్నానాలు చేయాల్సి ఉంటుంది.
ఈ దుష్ర్పభావాలు వస్తాయి:
మేషరాశి వారు మానసిక తీవ్ర ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి ఈ క్రమంలో గందరగోళ పరిస్థితులకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బీపీ తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నవారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించాలి. అంతేకాకుండా ఈ క్రమంలో శారీరక నొప్పులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మేష రాశువారు తమ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగార్ధులు తమ పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఆఫీస్‌లో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కోసం చూస్తున్నవారు ఈ చంద్రగ్రహణం సమయంలో పనులు ప్రారంభించవద్దని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రాశివారికి ఏవేనా పను చేసే క్రమంలో అటంకాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఓర్పుతో ఇతరులకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.
Also Read: India Vs Bangladesh Preview: లైట్ తీసుకుంటే షాక్ తప్పదు.. బంగ్లాకు చుక్కలు చూపియాల్సిందే..!
Also Read: Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి