Chandra Grahan 2022: ఆస్ట్రాలజీలో 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు ఏర్పడటం అరుదుగా జరుగుతుంది. గత నెల చివరిలో సూర్యగ్రహణం ఏర్పడగా.. రేపు చంద్రగ్రహణం (Chandra Grahan 2022) ఏర్పడుతుంది. నవంబరు8న ఏర్పడబోయే చంద్రగ్రహణం ఈ సంవత్సరం చివరిది. రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కనిపించనుంది. ముందుగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో ఈ గ్రహణం కనిపించనుంది. గ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం ఏర్పడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశిలో చంద్రగ్రహణం
ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం మేషం మరియు భరణి నక్షత్రాలలో ఏర్పడతుంది. ఇది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం నవంబర్ 8న సాయంత్రం 5.20 గంటలకు కనిపించి.. సాయంత్రం 6.20 గంటలకు ముగుస్తుంది. దీని సూతక కాలం నవంబర్ 8వ తేదీ ఉదయం 8.21 గంటలకు ప్రారంభమవుతుంది.


ఏయే ప్రాంతాల్లో కనిపించనుందా?
భారత కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 1.32 గంటల నుంచి ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం కనిపించనుంది. ఇండియాలో ఈ గ్రహణం సాయంత్రం పూట కనిపించనుంది. దేశంలోని తూర్పు ప్రాంతాలైనా ఇటానగర్, కోల్‌కతా, పాట్నా, సిలిగురి, గౌహతి మరియు రాంచీ మొదలైన ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. అదే సమయంలో అనేక నగరాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. 


దేశంలోని ప్రధాన నగరాల్లో చంద్రగ్రహణం ప్రారంభ సమయం:
** ఢిల్లీ- 5.28 PM
** నోయిడా- 5.30 PM
** అమృత్‌సర్- 5.32 PM
** లక్నో- 5.16 PM
** భోపాల్- 5.36 PM
** లూథియానా- 5.34 PM
** జైపూర్- 5.37 PM
** సిమ్లా- 5.20 PM
** ముంబై- 6.01 PM
** కోల్‌కతా- 4.52 PM
** పాట్నా- 5.00 PM
** ఇండోర్- 5.43 PM
** గాంధీనగర్- 5.55 PM
** హైదరాబాద్- 5.40 PM


Also Read: Dev Diwali 2022: ఇవాళే దేవ్ దీపావళి.. శుభముహూర్తంలో ఈ ఒక్క పని చేయండి చాలు.. మీరు ధనవంతులు అవుతారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి