Chandra Grahan Time 2022: సూర్య గ్రహణం తర్వాత ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం నవంబర్ నెలలో ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం నవంబర్‌ 08 మంగళవారం ఏర్పడబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ చంద్ర గ్రహనికి ఓ ప్రత్యేక ఉంది. కేవలం  సంపూర్ణ చంద్రగ్రహణం తూర్పు ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే భారత్‌లో పలు ప్రాంతాల్లో08 నవంబర్ దేవ్ దీపావళి జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ చంద్ర గ్రహణం రావడంతో జరుపుకోవాలో వద్దో అనే గందరగోళంలో ఉన్నారు భక్తులు. ఈ చంద్ర గ్రహణంతో పండగపై పడే ప్రభావవం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రగ్రహణం సమయాలు:
చంద్రగ్రహణం 2022 తేదీ: 08 నవంబర్ (మంగళవారం)
చంద్రగ్రహణం ప్రారంభ సమయాలు: సాయంత్రం 5:32 గంటలకు
చంద్రగ్రహణం ముగిసే సమయం: సాయంత్రం 06.18 గంటలకు
సూతక కాలం ప్రారంభ సమయం: ఉదయం 09:21
సూతక కాలం ముగిసే సమయం: సాయంత్రం 06.18


భారతదేశంలో చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?:
నవంబర్ 08 న చంద్రగ్రహణం భారతదేశంలోని కోల్‌కతా, సిలిగురి, పాట్నా, రాంచీ, గౌహతి మొదలైన ప్రదేశాలలో సంపూర్ణంగా కనిపించే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్ర వేత్తలు తెలుపుతున్నారు.  


భారత్‌లో కాకుండా ఇతర దేశాల్లో ఎక్కడ ఎక్కువగా ఈ గ్రహణం ప్రభావం ఉంటుంది:
చంద్రగ్రహణం ఉత్తర, తూర్పు ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుందని ఖగోళ శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ దేశాల్లో చంద్రగ్రహణం ప్రభావవం తీవ్రంగా ఉండబోతోందని సమాచారం..


చంద్ర గ్రహణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు:
>>చివరి చంద్ర గ్రహణాన్ని భారతదేశంలో చూడవచ్చు నవంబర్‌ 8వ తేదిన మీరు చూడొచ్చు. ఇది భారత కాలమానం ప్రకారం నవంబర్ 08 మధ్యాహ్నం 1.32 నుంచి సాయంత్రం 7.27 వరకు దీని ప్రభావవం భారత్‌లో కనిపిస్తుందని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
>>ఈ క్రమంతో గర్భిణీ స్త్రీలు పలు రకాల ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
>>ఈ చంద్రగ్రహణం సూతక్ కాలం అశుభ సమయాల్లో ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఈ గ్రహణం సమయాల్లో పలు రకాల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>>ఇది గ్రహణ సమయానికే 09 గంటల ముందే ప్రారంభమవుతుంది.
>>సూతక కాలం ప్రారంభమైన తర్వాత పూజ కార్యక్రమాలు చేయడం నిషిద్ధం. అంతేకాకుండా ఈ సమయంలో పూజలు కూడా చేయకూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>>చంద్రగ్రహణం సమయంలో ప్రయాణాలు చేయకూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>>చంద్రగ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.
>>ఈ సమయంలో నిద్రపోకూడదు, పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.
>>చంద్రగ్రహణం సమయంలో స్నానం చేయడానికి, దానానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.


 


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?


Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి