Chandra Grahanam and Rahu-ketu Gochar 2023: అక్టోబరు నెలలో కొన్ని కీలకమైన గ్రహ సంచారాలతోపాటు రెండో లేదా చివరి చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. దీంతో కొందరి జీవితాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. అక్టోబరు 30న రాహు, కేతు గ్రహాలు తమ రాశులను మారుస్తున్నాయి. దానికి ఒక్క రోజు ముందు అంటే అక్టోబరు 29న చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాహు-కేతు సంచారాలు మరియు చంద్రగ్రహణం కారణంగా 5 రాశులవారికి అదృష్టం కలిసి రానుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి
చంద్రగ్రహణం కర్కాటక రాశి లైఫ్ ను టర్న్ చేస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కష్టించి పనిచేస్తే మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంటి పెద్దలను సంప్రదించడం మంచిది. 
సింహరాశి 
రాహు-కేతువుల సంచారం సింహ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు పొందడంతోపాటు బిజినెస్ ను కూడావిస్తరిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. 
మేషరాశి
చంద్రగ్రహణం వల్ల మేషరాశి వారు మంచి లాభాలను పొందుతారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు కెరీర్లో మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంది. రాహు సంచారం వల్ల మీరు గురు చండాలయోగం నుంచి విముక్తి పొందుతారు. 


Also Read: Rahu Ketu Transit: ఈ గ్రహాల సంచారంతో 3 రాశులవారి జీవితాల్లో గోల్డెన్‌ డేస్‌ ప్రారంభం..


మిధునరాశి
రాహువు సంచారం మిథునరాశి వారికి ప్రతి కార్యంలో అదృష్టం కలిసి వస్తుంది. అనతి కాలంలోనే వీరు ధనవంతులు అవుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు మంచి లాభాలను ఇస్తాయి. మీరు ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
కుంభ రాశి
అక్టోబరులో గ్రహాల రాశి మార్పు వల్ల మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలాలను పొందుతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో సంతోషంగా గడుపుతారు. 


Also read: Venus Transit 2023: శుక్రుడి సంచారంతో ఈ 3 రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి