Chaturgrahi Yog: మేషరాశిలో చతుర్గ్రాహి యోగం.. ఈ 3 రాశులపై కనక వర్షం..
Chaturgrahi Yog benefits: ఈ నెలలో మేషరాశిలో బుధుడు, రాహువు, సూర్యుడు మరియు గురుడు కలయిక వల్ల అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
Chaturgrahi Yog benefits: గ్రహాలు ఎప్పటికప్పుడు తమ కదలికలను మారుస్తూ ఉంటాయి. ఏప్రిల్ నెల ప్రారంభమైంది. ఈనెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను చేయనున్నాయి. అదే విధంగా మేషరాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. బుధుడు, రాహువు, సూర్యుడు మరియు గురువు కలయికతో ఏర్పడిన ఈ యోగ ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుంది. ఈ చతుర్గ్రాహి యోగం వల్ల మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
చతుర్గ్రాహి యోగం ఈ రాశులకు వరం
సింహ రాశి
సింహ రాశి వారికి చతుర్గ్రాహి యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది..ఈ యోగం మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ప్రయాణాలు మీకు లాభిస్తాయి. ఉద్యోగం నిమిత్తం విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశ ఉంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీరు మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
మిథున రాశి
మిథునరాశి వారికి చతుర్గ్రాహి యోగం చాలా మేలు చేస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. వివిధ వనరుల ద్వారా మీకు ఆదాయం సమకూరుతుంది. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. మీరు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీరు లాటరీ లేదా షేర్ మార్కెట్ ద్వారా భారీగా డబ్బు వస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి చతుర్గ్రాహి యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిచక్రం యొక్క కర్మ స్థానంపై చతుర్గ్రహీ యోగం ఏర్పడుతుంది. అందుకే మీ ఆదాయంలో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది. పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులకు ఇది అద్భుతమైన సమయం. మీరు కొత్త ఆర్డర్‌లను పొందడం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఉద్యోగాలు చేసే వ్యక్తులు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.
Also Read: Budh Gochar 2023: జూన్ 07 వరకు ఈ 3 రాశులకు కష్టాలే కష్టాలు.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook