Chaturgrahi Yog In Scorpio 2022: వేద పంచాంగం ప్రకారం, గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశులను మార్చడం వల్ల కొన్ని అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. బుధుడు, శుక్రుడు మరియు సూర్యుడు వృశ్చికరాశిలో కలవడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. వీటితోపాటు కేతువు కలవడం వల్ల చతుర్గ్రాహి యోగం (Chaturgrahi Yog In Scorpio) ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీనం (Pisces): చతుర్గ్రాహి యోగం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు ఏదైనా పాత పెట్టుబడి నుండి ప్రయోజనం పొందుతారు. మీకు మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారంలో కొత్త కొత్త ఆర్డర్ ల పొందడం ద్వారా మీరు లాభాలను గడిస్తారు. తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
మిథునం (Gemini): చతుర్గ్రాహి యోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుండి మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. ప్రభుత్వం నుండి భారీ మెుత్తంలో లాభం పొందుతారు. భాగస్వామ్యంతో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. 
సింహం (Leo): చతుర్గ్రాహి యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో ఐదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. ప్రేమలో విజయం సాధిస్తారు. ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. ఇప్పుడు పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ మెుత్తంలో ప్రయోజనాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు రూబీ రాయిని ధరించడం వల్ల మీ అదృష్టం ప్రకాశిస్తుంది. 


Also Read: Guru Margi 2022: మీనంలో నడవనున్న గురుడు.. ఈ 5 రాశులవారిని వరించిన అదృష్టం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook