Chaturgrahi Yogam in Aries 2023: 12 ఏళ్ల తర్వాత ఈనెల 22న అదృష్టం మరియు ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవగురు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే రాహువు మరియు బుధుడు మేషరాశిలో కూర్చుని ఉన్నారు. రేపు అంటే ఏప్రిల్ 14న సూర్యభగవానుడు మేషరాశిలో సంచరించబోతున్నాడు. ఏప్రిల్ 22 నుండి నాలుగు ప్రధాన గ్రహాలైన రాహు, బుధుడు, సూర్యుడు మరియు బృహస్పతి మేషరాశిలో కలిసి ఉండటం వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఐదు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చతుర్గ్రాహి యోగం ఈ రాశులకు వరం 


కర్కాటకం: కర్కాటక రాశి వారికి చతుర్గ్రాహి యోగం విజయాన్నిస్తుంది. ఉద్యోగస్తులు పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 


ధనుస్సు: ధనుస్సు రాశి వారికి చతుర్గ్రాహి యోగం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాన్ని పొందుతారు. మీకు దాంపత్య సుఖం పొందుతారు. అంతేకాకుండా మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. 


మేషం: చతుర్గ్రాహి యోగం ఇదే రాశిలోనే ఏర్పడబోతోంది. ఇది మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు కెరీర్  లో ఉన్నత శిఖరాలను  అధిరోహిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఎంతటి రిస్క్ తీసుకోనైనా వీరు విజయం సాధిస్తారు. 


Also Read: Rajyog 2023: మూడు శతాబ్ధాల తర్వాత ఏర్పడిన నవపంచం రాజయోగం.. ఈ 4 రాశులవారికి లక్, ఐశ్వర్యం..


మిథునరాశి: చతుర్గ్రాహి యోగం మిథునరాశి వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వనుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ సమయలో మీరు తెలివిగా నిర్ణయం తీసుకోండి. 


సింహం: సింహ రాశి వారికి చతుర్గ్రాహి యోగం విజయాన్ని ఇస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీ ఐశ్వర్యం పెరుగుతాయి. మీరు కెరీర్ ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. జాబ్ చేసేవారు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. 


Also Read: Magal Gochar 2023: కుజ సంచారం 2023.. మే 10 నుంచి ఈ 4 రాశుల వారికి రాజయోగం! డబ్బేడబ్బు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి