Chaturmas 2022: చాతుర్మాసంలో ఈ 5 పనులు చేయడం ద్వారా.. మీ కోరికలు నెరవేరుతాయి!
Chaturmas 2022: జూలై 10వ తేదీ నుంచి చాతుర్మాసం ప్రారంభం కానుంది. చాతుర్మాసం నాలుగు నెలలపాటు ఉంటుంది. ఈ సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం.
Chaturmas 2022 Significance: జూలై 10వ తేదీ నుంచి చాతుర్మాసం ప్రారంభం కానుంది. శ్రీహరి (Lord Vishnu) 4 నెలలపాటు యోగ నిద్రలోకి వెళ్లనున్నాడు. అప్పుడు సృష్టిని రక్షించే బాధ్యతను లయకారుడైన శివుడు తీసుకుంటాడు. చాతుర్మాసంలో (Chaturmas 2022) పెళ్లి, నిశ్చితార్థం, క్షవరం వంటి కార్యక్రమాలు నిషిద్ధం. అయితే పూజలపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. దీని ద్వారా భగవంతుడి అనుగ్రహం పొందవచ్చు. చాతుర్మాస సమయంలో భక్తి, భజన మొదలైన వాటితో ఎక్కువగా గడపాలి. సత్యనారాయణ భగవానుని కథ వినడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి.
చాతుర్మాసం ఎప్పుడు ప్రారంభం?
పంచాంగం ప్రకారం, ఆషాడ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తేదీ జూలై 09, శనివారం నాడు ఉదయం 07:09 గంటలకు చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఇది జూలై 10 ఉదయం 04:43 గంటలకు ముగుస్తుంది. జూలై 9న సూర్యోదయానికి ముందే ఏకాదశి తిథి ముగియనున్న నేపథ్యంలో జూలై 10 నుంచి చాతుర్మాసం ప్రారంభం కానుంది.
చాతుర్మాసంలో ఏమి చేయాలి?
1. చాతుర్మాసాన్ని పాటించే వ్యక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఈ నాలుగు నెలలు నియమ నిష్టలతో ఉపవాసం ఉండాలి.
2. ఉపవాసం పాటించే వ్యక్తులు రోజులో ఒక్కసారే ఆహారం తీసుకోవాలి.
3. చాతుర్మాసాల్లో పరమశివుని, విష్ణువుని పూజించాలి. ఈ సమయంలో మీరు విష్ణు సహస్రనామం మరియు శివ చాలీసా పఠించవచ్చు. హరిహరుల అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరుతాయి.
4. చాతుర్మాసంలో ఐదు రకాల దానాలకు ప్రాముఖ్యత ఉంది. అవే అన్నదానం, వస్త్రదానం, నీడ దానం, దీప దానం. అంతేకాకుండా ఏదైనా దేవాలయంలో సేవ చేయడం ద్వారా కూడా శుభఫలితాలు పొందుతారు.
5. చాతుర్మాసంలో ఆకు కూరలు, భాద్రపదంలో పెరుగు, అశ్వినిలో పాలు, కార్తీకమాసంలో పప్పులు తినవద్దు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి