Chaturmasam 2022: హిందూమతంలో చతుర్మాసానికి విశేష ప్రాధాన్యత ఉంది. చతుర్మాసంలో నిర్ణీత పద్ధతిలో శివుడిని పూజిస్తే..ప్రసన్నుడై కోర్కెలు నెరవేరుస్తాడని ప్రతీతి. చతుర్మాసం ఎప్పుడు, శివుడిని ఎలా పూజించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆషాఢమాసం శుక్లపక్షంలోని ఏకాదశి తిథి నుంచి కార్తీక మాసపు శుక్లపక్షం తిథి వరకూ చతుర్మాసం ఉంటుంది. ఈ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదనే వివరాలు జ్యోతిష్యశాస్త్రంలో స్పష్టంగా ఉన్నాయి. నాలుగు నెలల కాలమైనందున చతుర్మాసం అన్నారు. ఈ కాలంలో విష్ణువు యోగ నిద్రలో ఉండటంతో..సర్వ సృష్టి బాధ్యతలు శివుడు తీసుకుంటాడు. జ్యోతిష్యం ప్రకారం ఈ నాలుగు నెలల్లో శివుడిని ప్రసన్నం చేసుకుంటే కోర్కెలు నెరవేరుతాయి.


చతుర్మాసంలో శివుడి పూజ చాలా ప్రయోజనకరం. అంతేకాదు..ఈ నాలుగు నెలల్లో శివుడికి అత్యంత ఇష్టమైన శ్రావణ మాసం కూడా ఉంది. మతపరమైన కార్యక్రమాలు, పూజలు వంటివాటికి చతుర్మాసం చాలా ముఖ్యమైంది. ఈ నాలుగు నెలల్లో శివుడిని స్వచ్ఛమైన మనస్సుతో, భక్తి శ్రద్దలతో పూజిస్తే శివుడు ప్రసన్నమౌతాడని అంటారు. అంతేకాకుండా..భక్తుల కష్టాలన్నీ దూరం చేస్తాడు. ఈ సందర్భంగా మహాదేవుడైన శివుడి కటాక్షం కోసం కొన్ని విషయాల్ని గుర్తుంచుకోవాలి. చతుర్మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం..


చతుర్మాసంలో శివుడి కటాక్షం కోసం ఏం చేయాలి


ఈ నాలుగు నెలలు హవిష్టయాన సేవనం మాత్రమే చేయాలి. హవిష్టయానం అంటే యజ్ఞం సమయంలో చేసే అన్నం లేదా ఆహారం. ఈ నాలుగు నెలలు నేలపైనే పడుకోవాలి. చతుర్మాసంలో బియ్యం, పెసర, జొన్న, గోధమలు, సముద్ర ఉప్పు, పెరుగు, నెయ్యి, నువ్వులు, మామిడి, కొబ్బరి, ములక్కాయ. ఆవు పాలు, అరటి వంటి వస్తువుల్ని మాత్రమే తినాలి. 


ఏం చేయకూడదు


ఈ నాలుగు నెలలు అంటే చతుర్మాసంలో ఇతరుల ఇంటి భోజనం తినకూడదు. ఈ సమయంలో మసూర్, మాంసం, లోబియా, పికిల్స్, వంకాయ, రేగు, ముల్లంగి, ఉసిరి, చింతకాయ, ఉల్లిపా, వెల్లుల్లి పొరపాటున కూడా తినకూడదు. ఏ విధమైన శుభ కార్యాలు చేయకూడదు. చతుర్మాసంలో శివుడి కటాక్షం కోసం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ నాలుగు నెలల కాలంలో మంచం లేదా నాలుగు కాళ్ల వేదికపై పడుకోకూడదు. 


Also read: Happy Sravanam 2022: శ్రావణ మాసం ప్రారంభం.. విషెస్ చెప్పేయండి ఇలా..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook