Christmas 2023: క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు.. ఇయర్ ఎండింగ్ వచ్చింది అంటే..చాలామంది సెలవులు ఎప్పుడు వస్తాయా.. వీకెండ్ ప్లానింగ్ ఎలా వేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. క్రిస్మస్ వేడుకలు విదేశాలలో ఎంతో వైభవంగా జరుగుతాయి. సెలవులు కూడా ఉంటాయి కాబట్టి ప్రజలు ఈ క్రిస్మస్ వేడుకలను ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఈసారి మనకు కూడా ఈ అవకాశం ఉంది.. ఎందుకంటే ఈసారి క్రిస్మస్ సోమవారం వచ్చింది కాబట్టి లాంగ్ వీకెండ్ కి మంచి ప్లానింగ్ వేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు ఎంచక్కా శుక్రవారం ఆఫీస్ తర్వాత మీ ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ ట్రిప్ కి ప్లాన్ చేసుకోవచ్చు. క్రిస్మస్ సంబరాలను చూస్తూ ఈ లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి మన దేశంలోనే కొన్ని ప్రదేశాలు.. అక్కడ జరిగే అదిరిపోయే క్రిస్మస్ వేడుకలు గురించి తెలుసుకోవడం తప్పనిసరి. మరి ఆ ప్రదేశాలు ఏమిటో ?వాటి స్పెషాలిటీ ఏంటో ?తెలుసుకుందాం పదండి.


కేరళ


గాడ్స్ ఓన్ సిటీ గా పేరు పొందిన కేరళ లో క్రిస్మస్ సంబరాలు అద్భుతంగా జరుగుతాయి. పురాతన కాలంనాటి పెద్ద పెద్ద చర్చలకు నెలవైన కేరళలో.. ప్రకృతి ఒడిలో ఎంతో రమణీయంగా క్రిస్మస్ వేడుకలు సాగుతాయి.



గోవా


రమణీయమైన బీచ్ సోయగాలకు ఆనవాలుగా నిలిచే గోవాలో ఎప్పుడూ సందడి ఉండనే ఉంటుంది. అయితే డిసెంబర్ నెలలో మాత్రం గోవా సిటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎందరో దూరప్రాంతం నుంచి పర్యాటకులు ఈనెల క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు గోవాలో జరుపుకోవడానికి వస్తారు. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ చర్చ్ లను మాత్రమే కాదు వీధులు ,భవనాలను కూడా విద్యుత్ కాంతులతో రంగురంగుల లైట్లతో నింపేస్తారు. ఈ క్రిస్మస్ కి గోవా ప్లాన్ చేసుకుంటే బీచ్ లో ఎంజాయ్ చేయడంతో పాటు మంచి క్రిస్మస్ వేడుకల్ని కూడా చూడవచ్చు.


సిక్కిం


డిసెంబర్ నెల మామూలుగానే చలి ఎక్కువ.. ఇక సిక్కింలాంటి ప్రాంతంలో చలి పులిలా మనల్ని కొరుక్కుతింటుంది. అయినా కానీ ఈ టైంలో అక్కడికి వెళ్తే.. అందమైన క్రిస్మస్ వేడుకలను ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు. పైగా ఈ సీజన్ లో సిక్కిం లో ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. 



పాండిచ్చేరి


ఇండియాలో లిటిల్ ఫ్రాన్స్ గా పేరు పొందిన పాండిచ్చేరిలో క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఇది కూడా బీచ్ ప్రాంతం కావడంతో ఈ సీజన్లో ఇక్కడ చాలా బీచ్ పార్టీలు జరుగుతాయి. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ పలు రకాల ఈవెంట్స్ తో సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. మీకు పాండిచ్చేరి బాగా దగ్గర అయితే తప్పకుండా ఈ లాంగ్ వీకెండ్ క్రిస్మ స్ ఎంజాయ్ చేయడానికి పాండిచ్చేరి ట్రిప్ ప్లాన్ చేసుకోండి.


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ


Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook