Budhaditya Rajyog: మేషరాశిలో బుధాదిత్య రాజయోగం.. రేపటి నుంచి ఈ 3 రాశులకు దశ తిరగబోతుంది..
Astrology Prediction: గ్రహాల రాజు, గ్రహాల యువరాజు మేషరాశిలో కలిసి ఓ అరుదైన రాజయోగాన్ని సృష్టించబోతున్నారు. ఈ యోగం కారణంగా కొందరి దశ తిరగబోతుంది. ఆ అదృష్ట జాతకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Sun and Mercury Conjunction in Mesh Rashi 2024: గ్రహాలు నెలకొకసారి కదలికలను మారుస్తాయి. ఇలా తమ గమనాన్ని మార్చి ఇతర గ్రహాలతో సంయోగం జరిపి కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. ఇందులో శుభ, అశుభకరమైన యోగాలు ఉంటాయి. ఇవి మెుత్తం 12 రాశులవారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాల యువరాజైన బుధుడు, గ్రహాలు రాజు అయిన సూర్యుడు త్వరలో మేషరాశిలో రాజయోగాన్ని సృష్టించబోతున్నారు. మేధస్సును ఇచ్చే మెర్క్యూరీ, గౌరవాన్ని ఇచ్చే సూర్యుడు కలయిక వల్ల పవిత్రమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి అపారమైన సంపదను, సమాజంలో గౌరవాన్ని ఇవ్వబోతుంది. ఆ లక్కీ రాశులవారు ఎవరో తెలుసుకుందాం.
మేషరాశి
ఇదే రాశిలో సూర్యుడు మరియు బుధుడు బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం వల్ల మీరు కెరీర్ లో మంచి స్థాయికి ఎదుగుతారు. వ్యాపారులు ఇంతకముందు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. మేషరాశి వారు ఆర్థికంగా స్థిరపడతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్, ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
మీనరాశి
మేషరాశిలో సంభవించబోతున్న బుధాదిత్య రాజయోగం మీనరాశి వారికి మంచి ఫలితాలనే ఇస్తుంది. వీరికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే వారు తిరిగి ఇస్తారు. ఆఫీసులో మీరు చేసిన ప్రాజెక్టు సక్సెస్ అవ్వడంతో మీకు మీ బాస్ నుంచి ప్రశంసలు లభిస్తాయి, అంతేకాకుండా ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు మంచి రాబడులను ఇస్తాయి.
కర్కాటక రాశి
గ్రహాల రాజు, గ్రహాల యువరాజు చేస్తున్న అరుదైన యోగం కారణంగా కర్కాటక రాశి వారి దశ మారబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కెరీర్ కు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. ఆకస్మిక ధనాన్ని పొందుతారు. డబ్బు సంపాదించే మార్గాలు పెరుగుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఫారిన్ టూర్ వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కచ్చితంగా విజయం సాధిస్తారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ప్రజల నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Akshaya Tritiya 2024: మే 10న అక్షయ తృతీయ.. ఈ నాలుగు రాశులకు అఖండ ధనయోగం..
Also Read: Guru Gochar 2024: 10 ఏళ్ల తర్వాత కృత్తికా నక్షత్రంలోకి దేవ గురువు సంచారం.. ఈ రాశుల వారికి ధనమే ధనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి