Crassula Plant Home Vastu Tips, Small Crassula plant is more effective than Money Plant: మనీ ప్లాంట్.. వాస్తు పాటించే వారికి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సంపద, ఆర్థిక వృద్ధికి మనీ ప్లాంట్ ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ కంటే అత్యంత ప్రభావమైన మొక్క కూడా ఉంది. అదే క్రాసులా ప్లాంట్. దీనిని జేడ్ ప్లాంట్, లక్కీ ట్రీ, మనీ ట్రీ అని కూడా పిలుస్తారు. క్రాసులా మొక్క సానుకూల శక్తిని బాగా ఆకర్షిస్తుంది. అందుకే ఇంట్లో క్రాసుల మొక్కను నాటడం చాలా శుభప్రదం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రాసులా మొక్క డబ్బును అయస్కాంతంలా ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈ మొక్కను నాటడం వలన ఇంట్లో లేదా కార్యాలయంలో డబ్బుకు అస్సలు లోటు ఉండదు. అంతేకాదు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా సృష్టించబడుతాయి. ఇంట్లో సంపద మరియు శ్రేయస్సును పెంచడంలో మనీ ప్లాంట్ కంటే ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే దీనిని 'డబ్బు చెట్టు' అని కూడా అంటారు.


ఇంట్లో క్రాసులా మొక్కను ఇలా నాటండి:
వాస్తు శాస్త్రంలో ధనం లేదా డబ్బు రావడానికి చాలా శుభప్రదంగా చెప్పబడే క్రాసులా మొక్కను నాటేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా చాలా ముఖ్యం. క్రాసులా మొక్కను సరైన దిశలో నాటితేనే దాని పూర్తి ఫలం లభిస్తుంది. క్రాసులా మొక్కను ఎప్పుడూ ఇంటి ప్రవేశ ద్వారం కుడి వైపున నాటాలి. ఎడమ వైపున నాటితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. క్రాసులా మొక్కను ఇంటి లోపల కూడా నాటవచ్చు. నేరుగా సూర్యరశ్మి ఈ మొక్కపై పడకుండా చూసుకోవాలి. 


ఏ దిశలో నాటకూడదంటే:
ఉత్తర దిశలో క్రాసుల మొక్కను నాటడం అత్యంత శ్రేయస్కరం. ఈ మొక్కను ఇంటి లోపల ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటడం కూడా మంచిదే. క్రాసులా మొక్కను దక్షిణ దిశలో అస్సలు నాటకూడదు. ఇలా నాటడం వల్ల లాభానికి బదులు నష్టం కలుగుతుంది.


క్రాసులా ప్రయోజనాలు:
# క్రాసుల మొక్క ఉన్న ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు. ధన నష్టం మరియు దుబారా ఖర్చుల నుంచి రక్షణ ఉంటుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
# క్రాసులా ప్లాంట్‌ను ఆఫీసు డెస్క్‌పై ఉంచడం వల్ల సానుకూలత ఉంటుంది. అదే సమయంలో పురోగతి మార్గం తెరుచుకుంటుంది. అన్ని పనుల్లో విజయం ఉంటుంది.
# క్రాసులా ప్లాంట్‌ను మీ వ్యాపార సంస్థలో కూడా పెట్టుకోవచ్చు. దీంతో వ్యాపారం పెరిగి అధిక ఆదాయం వస్తుంది.


Also Read: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. రానున్న మూడు రోజుల్లో వర్షాలు!


Also Read: Golden Boot Winner 2022: లియోనెల్‌ మెస్సీని సైతం వెనక్కు నెట్టి.. గోల్డెన్‌ బూట్‌ గెలుచుకున్న కైలియన్‌ ఎంబాపే!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.