Dev Deepawali 2022 Shubh Muhuratam: దేవ్ దీపావళి పండుగను ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీపావళి తర్వాత సరిగ్గా 15 రోజులకు ఈ ఫెస్టివల్ ను చేసుకుంటారు. కానీ ఈ ఏడాది  కార్తీక పూర్ణిమ నవంబరు 8న వచ్చింది. అదే రోజు చంద్రగ్రహణం ఏర్పడటంతో... ఒక రోజు ముందు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ దేవ్ దీపావళిని (Dev Diwali 2022) ముఖ్యంగా బనారస్‌లో ఘనంగా జరుపుకుంటారు. దేవ్ దీపావళి నాడు గంగా నదిలో దీపాన్ని వదిలే సంప్రదాయం ఉంది. ఈ రోజున దేవతలు భూమిపైకి వచ్చి కాశీలో దీపావళి జరుపుకుంటారని నమ్ముతారు. అందుకే ఈ పండుగను దేవ్ దీపావళి అంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేవ్ దీపావళి శుభ సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసం పౌర్ణమి రోజున దేవ్ దీపావళి జరుపుకుంటారు. ఇది ఈ సంవత్సరం 7 నవంబర్ 2022న సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 8న సాయంత్రం 4:31 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, దేవ్ దీపావళి నవంబర్ 8న జరుపుకోవాలి. అయితే ఈ రోజున చంద్రగ్రహణం కారణంగా, నవంబర్ 7న దేవ్ దీపావళి జరుపుకోనున్నారు. దేవ్ దీపావళి రోజున ఒక శుభ సమయంలో దీపాన్ని నీటిలో వదలడం వల్ల జీవితంలో అపారమైన ఆనందం, అదృష్టం వస్తుంది. 
ప్రదోష కాలములో దీప దానం ముహూర్తం - సాయంత్రం 05:14 నుండి 07:49 వరకు. 


దేవ్ దీపాన్ని ఇలా దానం చేయాలి?
దేవ్ దీపావళి రోజున ఉదయాన్నే స్నానం చేయండి. అప్పుడు ఉదయిస్తున్న సూర్యునికి అర్ఘ్యం సమర్పించి.. అనంతరం తులసి మెుక్కకు నీరు పోయండి. తరువాత శివుడు మరియు విష్ణువును పూజించండి. ఆ తర్వాత ప్రదోష కాల సమయంలో పవిత్ర నదిలో 11, 21, 51 లేదా 108 దీపాలు వెలిగించి నీటిలో వదలండి. వీటిని బియ్యం పిండితో చేయండి. దీపాన్ని వదిలే ముందు పసుపు, కుంకుమ, అక్షతలను దానిపై చల్లండి. 


దేవ్ దీపావళి ప్రాముఖ్యత
దేవ్ దీపావళి అంటే కార్తీక పూర్ణిమ రోజున దేవతలు గంగా ఘాట్ వద్ద స్నానం చేయడానికి కాశీకి వస్తారని పురాణాల నమ్మకం. ఈ రోజు ప్రదోషకాలంలో నీటిలో దీపాన్ని వదలడం వల్ల శత్రు భయం ఉండదు. దీనితో పాటు మీరు అపారమైన ఆనందం, శ్రేయస్సు మరియు అదృష్టం పొందుతారు. అలాగే, దేవ్ దీపావళి రోజున దీపం దానం చేయడం వల్ల యమ, శని, రాహు-కేతువుల ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుంది మరియు లక్ష్మీ దేవిని అనుగ్రహం లభిస్తుంది. 


Also Read: Horoscope Today: నేటి రాశిఫలాలు... ఈ 3 రాశులవారు అందరి ప్రశంసలు అందుకుంటారు.. ఇందులో మీరున్నారా మరి.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook