Dhanteras 2022: దీపావళి, ధన్తేరస్ రోజున ఇలా దీపదానం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ చెక్..
Dhanteras 2022: హిందువులకు ముఖ్యమైన పండగల్లో దీపావళి, ధన్తేరస్ పండగలు అతి ముఖ్యమైనవి. అయితే ఈ క్రమంలో లక్ష్మిదేవిని పూజించి దీపాలు వెలిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
Dhanteras 2022: హిందూ సాంప్రదాయంలో దీపావళి, ధన్‌తేరస్ పండగలకు చాలా ప్రముఖ్యత కలిగి ఉంది. ఈ నెలలో మూడు రోజుల పాటు లక్ష్మీ దేవి, కుబేరుడు, ధన్వంతరి ఆరాధించడం భక్తుల ఆనవాయితి. అయితే ఈ దీపావళి పండగ రోజుల్లో కొన్ని దేవతలను పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా లక్ష్మీ దేవితో పాటు ధన్వంతరిని పూజించడం వల్ల అపారమైన సంపద కలుగుతుందని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రాశుల వారు అదృష్టాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ధన్‌తేరస్ పండగ రోజున ఎలా పూజలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ధన్‌తేరస్ రోజున బంగారం, వెండి వస్తువులు, పాత్రలను కొనుగోలు చేయడం శ్రేయస్కరమని పేర్కొన్నారు. అంతేకాకుండా కొత్తిమీర గింజలను కొనుగోలు చేసిన మంచి ప్రయోజనాలు పొందుతారని శాస్త్రం భావిస్తోంది. అయితే వీటిని కొనుగోలు చేసి లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ క్రమంలో ఆర్థిక పరంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.
ధంతేరస్ రోజున పసుపు పెంకులు తెచ్చి పూజా క్రమంలో వినియోగించడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు దూరమవుతాయని జోతిష్య శాస్త్రం తెలుపుతోంది. పసుపు రంగులకు బదులుగా తెల్లటి పెంకులను వాడిన ఇలాంటి ప్రయోజనాలే పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తే లక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తుంది.
ధన్తేరస్ రోజు దీపదానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అయితే సాయంత్రం పూజా ముగించుకునిపదమూడు దీపాలు వెలిగించాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత దీపదానం చేస్తే ఆర్థిక పరమైన సమస్యలు తీరుతాయి.
పూజ చేసే క్రమంలో దీపాలను దక్షిణం వైపున ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా రెండు దీపాలు వెలిగించాలి. ఒక దీపాన్ని ఇంటి ముందు ఉన్న తులసి ముందు ఉంచితే మంచి ప్రయోజనాలు పొందుతారు.
రాత్రిపూట అన్ని దీపాల దగ్గర పసుపుతో కూడా ముగ్గులు వేయాల్సి ఉంటుంది. అయితే పూజ కార్యాక్రమాలు ముగిసిన తర్వాత లక్ష్మిదేవికి సమర్పించిన నైవేద్యాన్ని ఇతరులకు దానం చేయాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook