Dhanteras 2022: ధన త్రయోదశి భారతీయులకు అతి ముఖ్యమైన పండగ. ఈ పండగను దీపావళికి ముందు రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ధనము త్రయోదశి అక్టోబర్ 23, 22 తేదీల్లో జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది ఈ పండగ రోజున పలు రకాల తప్పుడు పనులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ కింద పేర్కొన్న పనులను ధన త్రయోదశి రోజున అస్సలు చేయకూడదని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఆ పనులేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధన త్రయోదశి రోజున ఏపనులు చేయోచ్చు.. ఏపనులు చేయకూడదు:


>>ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన నెయ్యి, పాలు, పెరుగు, తీపి వంటకాలు, తెలుపు రంగు దుస్తులు అస్సలు దానం చేయకూడదు. అంతేకాకుండా విరాళాలు కూడా ఇవ్వకూడదని శాస్త్రా నిపుణులు చెబుతున్నారు.


>>ఈ రోజు అప్పుగా తీసుకున్న డబ్బుతో ఏమీ కొనకూడదు. ధన త్రయోదశి రోజున మీ సామర్థ్యాన్ని బట్టి షాపింగ్ చేయండి. మీ స్వంత సంపాదనతో కొనండి. లేకపోతే తీవ్ర ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.


>>రాత్రి పూట లక్ష్మీదేవి, ధన్వంతరిని పూజలు చేసిన తర్వాత ఇల్లు ఖాళీగా ఉండకూడదు. ఇంట్లో తప్పకుండా మనుషులు ఉండాలి. ఇంట్లో నుంచి ఒక్క సారిగా అందరు బయటకు వెళ్ల కూడదు.


>>ధనత్రయోదశి రోజున బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాలి. ఆ వస్తువులను ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక పరమైన సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి.  


>>ధనత్రయోదశి రోజున పేదలకు వస్తువులను దానం చేయాలి. ఇలా దానాలు చేయడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.


Also Read : Ori Devuda Vs Ginna : విశ్వక్ సేన్‌ను కూడా దాటని మంచు విష్ణు


Also Read : Actress Anjali Pavan : అమ్మ మాత్రమే.. నాన్న లేరు.. స్టేజ్ మీద ఏడిపించేసిన మొగలిరేకులు అంజలి పవన



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook