Dhanteras 2023: ధన త్రయోదశి రోజు బంగారం ఏ సమయాల్లో కొనుగోలు చేయాలో తెలుసా?, పూజా సమయాలు ఇవే!
Dhanteras 2023: ధన త్రయోదశి పండగకు హిందు సాంప్రదాయంలో ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. ఈ పండగ రోజున చాలా మంది బంగారం, వెండి కోంటూ ఉంటారు. ఏయే సమయంలో కొనుగోలు చేయడం శుభప్రదమో, పూజ సమయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Dhanteras 2023: హిందూ సంప్రదాయం ప్రకారం ధన త్రయోదశి పండగకి ప్రత్యేక ప్రముఖ్య ఉంది. ఈ పండగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి నవంబర్ 10 తేదిన వచ్చింది. ఈ పండగ రోజు కొత్త పాత్రలు, బంగారు ఆభరణాలు, వెండి నాణేలు లేదా పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా కార్లు కొనడం ఆనవాయితిగా వస్తోంది. ఈ ధన త్రయోదశిని కార్తీక మాసంలో కృష్ణ త్రయోదశి అని కూడా అంటారు. దీపావళి పండుగలో ఈ పండగ కూడా భాగమే..అంతేకాకుండా ఈ పండగను చాలా ప్రాంతాల్లో 'ధన్వంతరి త్రయోదశి'గా కూడా పిలుస్తారు. అయితే ఈ పండగకు సంబంధించిన శుభ సమయం, ఏయే సమయాల్లో బంగారు ఆభరాణాలు కొనుగోలు చేయడం శుభప్రదమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ధన త్రయోదశి చరిత్ర:
క్షీర సాగర మథన సమయంలో సముద్రం నుంచి అమ్మవారు, కుబేరుడు ప్రత్యేక్షమవుతారు. ఇదే సమయంలో సాగర మథనం నుంచి వచ్చే అమృతం రాక్షసులకు దక్కుతుంది. అయితే దేవతలు అంతా కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తారు. ఈ సమయంలో వారికి సముద్రం నుంచి ధన్వంతరి ప్రత్యేక్షమవుతారు. ఇందంతా కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి రోజున జరుగుతుంది. ధన్వంతరి దేవతలకు చివరి సారిగా ప్రత్యేక్షం కావడంతో ఇదే రోజును ధన త్రయోదశి లేదా ధన్వంతరి త్రయోదశి పిలుస్తారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
ధన త్రయోదశి పూజ సమయాలు:
ధన త్రయోదశి నవంబర్ 10వ తేదీన జరుపుకోవడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పూజ ముహూర్తం సాయంత్రం 5:47 గంటలకు ప్రారంభమై..రాత్రి 7:43 వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం పూజా ముహోర్తం రెండు గంటల పాటు ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి, గణేశుడు, ధన్వంతరి, కుబేరులను పూజించడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా రాష్ట్రాల్లో సరస్వతీ దేవి, మహా లక్ష్మి దేవి, మహా కాళి దేవి అమ్మవారులను కూడా పూజిస్తారు. ఇదే సమయాల్లో కొత్త పాత్రలు, బంగారు ఆభరణాలు, వెండి నాణేలు శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
స్నేహితులకు, బంధువులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు:
కుబేరుడు ఎల్లప్పుడూ మీ చుట్టూ ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు.
ధన త్రయోదశి పండుగ మీ జీవితంలో అదృష్టం, సంపద, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటూ..ధన త్రయోదశి శుభాకాంక్షలు.
ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి మీ జీవితంలో సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ధన త్రయోదశి శుభాకాంక్షలు.
మీ జీవితం ఎప్పుడూ బంగారంలా ప్రకాశించాలని కోరుకుంటూ ధన త్రయోదశి శుభాకాంక్షలు.
లక్ష్మీ దేవి ఆశీస్సులతో మీ జీవితంలో ఆనందం, సంపద రెట్టింపు అవ్వాలని కోరుకుంటూ ధన త్రయోదశి శుభాకాంక్షలు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook