Dhanteras 2022: ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు హిందువులు. ఆయుర్వేద విజ్ఞానానికి ఆరాధ్య దైవం ధన్వంతరి. ధనత్రయోదశితోనే  దీపావళి పండుగ మెుదలవుతుంది. ఈ ఏడాది ధంతేరాస్ లేదా ధనత్రయోదశిని (Dhanteras 2022) అక్టోబరు 23న జరుపుకోనున్నారు. ఈ రోజున షాపింగ్ చేయడం మంచిదిగా భావిస్తారు. అందుకే ఈ రోజున బంగారం, వెండిని కొనుగోలు చేసి పూజలో పెడతారు. దీంతో ఆ ఇంట్లో అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్రత విధానం


ఈరోజున సూర్యోదయానికి ముందే స్నానమాచరించి.. ఇంటి పూజా మందిరంలో తూర్పుదిక్కుగా కలశ స్థాపన చేయాలి. తర్వాత ధన్వంతరిని ఆవాహన చేయండి. ధన్వంతరిని ధ్యానించిన తర్వాత యధాశక్తి షోడశోపచారాలతో పూజలు చేయండి.  వ్రత పూర్తయిన తర్వాత వైద్యులకి, పెద్దలకి తాంబూలం సమర్పించి.. ప్రసాదాన్ని పంచి పెట్టండి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం జీవిస్తారని నమ్ముతారు.


యమ దీపం ఎందుకు పెడతారు?


అంతేకాకుండా ఈరోజున యముడు పేరుతో దీపం వెలిగిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణ దిశలో పిండితో నాలుగు ముఖాల దీపం తయారు చేసి వెలిగిస్తారు. అనంతరం 'మృత్యునాం దండపాశాభయం కాలేన్ శ్యామయ సః. త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రియతాం మామ్'. మంత్రాన్ని జపించాలి. ఈ సంప్రదాయం ప్రాచీనకాలం నుంచి కొనసాగుతోంది. ధంతేరాస్ రోజున దీపదానం చేయడం ద్వారా అకాల మరణం నుండి విముక్తి లభిస్తుంది. 


Also Read: Mangal Gochar 2022: కుజుడు రాశి మార్పు.. ఇక ఈ 3 రాశులవారికి అన్నీ మంచి రోజులే.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook