Dhantrayodashi 2022: ధన త్రయోదశి ఎప్పుడు? ఈ రోజు బంగారాన్ని ఎందుకు కొంటారు?
Dhanteras 2022: ధన త్రయోదశి ఈ ఏడాది 23 అక్టోబర్ 2022న వస్తుంది. ఐదు రోజుల దీపావళి పండుగ ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ పండుగ యెుక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
Dhanteras 2022 Date: దీపావళి ధన త్రయోదశితోనే ప్రారంభమవుతుంది. ధనత్రయోదశికే ధంతేరాస్, ధన్‌తేరస్ అనే పేర్లున్నాయి. ఈ ఏడాది ధన్‌తేరస్ 23 అక్టోబర్ 2022న వస్తుంది. కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి రోజున ధన త్రయోదశిని (Dhantrayodashi 2022) జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుడితోపాటు ఆయుర్వేద కర్త ధన్వంతరిని పూజిస్తారు. ఈ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేసి దాచుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆ ఇల్లు అష్టఐశ్వర్యాలతో తులతూగుతుందని నమ్ముతారు. ధన త్రయోదశినాడు కొత్త వస్తువులు కొనుగోలు చేయడమనేది సంప్రదాయంగా కొనసాగుతుంది. ధన్‌తేరస్ శుభ సమయం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
ధన త్రయోదశి 2022 శుభ ముహూర్తం
కార్తీక మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథి ప్రారంభం - 22 అక్టోబర్ 2022, సాయంత్రం 6.02 నుండి
కార్తీక మాసం కృష్ణ పక్ష త్రయోదశి తేదీ ముగింపు - 23 అక్టోబర్ 2022, సాయంత్రం 6.03 వరకు
ధన్వంతరిని పూజించడానికి శుభ సమయం - 23 అక్టోబర్ 2022 సాయంత్రం 5.44 నుండి 06.05 వరకు.
ప్రదోష కాలం: సాయంత్రం 5.44 నుండి రాత్రి 8.16 వరకు
వృషభ రాశి కాలం: సాయంత్రం 6.58 నుండి రాత్రి 8.54 వరకు
ధంతేరాస్ 2022 ప్రాముఖ్యత
ధన్వంతరి భగవానుడు ధనత్రయోదశి రోజున జన్మించాడు కాబట్టి ఈ రోజును ధన్‌తేరస్‌గా పిలుస్తారు. ధన్వంతరి విష్ణువు అవతారమని నమ్ముతారు. పురాణాల ప్రకారం, ధన్వంతరి సముద్ర మథనం నుండి ఉద్భవించినప్పుడు అతని చేతిలో అమృతంతో నిండిన కలశం ఉంది. అందుకే ధన్ తేరస్ రోజున పాత్రలు, బంగారం, వెండి, నగలు కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ధన్‌తేరాస్ రోజున ధన్వంతరి మరియు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున ప్రదోష కాలంలో యముడికి దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల అకాల మృత్యుభయం తొలగిపోతుందని నమ్మకం.
Also read: Lord Shiva: సోమ ప్రదోష వ్రతం రోజు శివుడిని ఇలా పూజిస్తే.. మీ ఇంట డబ్బే డబ్బు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook