Dhanteras 2022 Puja Vidhanam: ఈ ఏడాది ధంతేరాస్ లేదా ధనత్రయోదశి అక్టోబరు 23న వస్తుంది. ఈ రోజున ప్రజలు భారీగా షాపింగ్ చేస్తారు. ఈ రోజున ఆయుర్వేద విజ్ఞానానికి ఆరాధ్య ధైవమైన ధన్వంతరిని (Lord Dhanwantari) పూజిస్తారు. హిందువులు ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా (Dhanteras 2022) జరుపుకుంటారు. ఈ రోజున ధన్వంతరితోపాటు కుబేరుడు, గణేశుడు, లక్ష్మీదేవి మరియు యమధర్మరాజును కూడా ఆరాధిస్తారు. దీంతో ఈ దేవతలు వారిపై అనుగ్రహం కురిస్తారని నమ్ముతారు. అయితే వీరిని సరైన పద్ధతిలో పూజించకపోతే ఫలితం ఉండదు. అందుకే ధంతేరాస్ రోజున ఎలా పూజించాలో  తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూజ విధానం
ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి. ఇంటి పూజ స్థలం ఎప్పుడు  ఈశాన్య దిశలో ఉండాలి. పూజా సమయంలో భక్తులు ముఖం ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండాలి. ఆరాధన సమయంలో పంచదేవతలను అనగా గణేశుడు, దుర్గాదేవి, శివుడు, విష్ణువు, సూర్య దేవులను ప్రతిష్టించండి. అనంతరం కుటుంబం మెుత్తం పూజించండి. ఇలా చేయడం వల్ల మీకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి. 


ఇంటి పూజగదిలో తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరికి ఆవాహన చెయ్యాలి. ధన్వంతరిని ధ్యానించిన తర్వాత యధాశక్తి షోడశోపచార సహితంగా పురుషసూక్త విధానంతో అర్చన జరపాలి. మత్స్యపురాణాంతర్గతమైన స్తోత్రాన్ని పఠించి, గరుడ పురాణాంతర్గతమైన ధన్వంతరి సార్థవ్రత కథను పారాయణ చేయాలి. వ్రత సమాప్త్యానంతరం ఇతర వైద్యులకి, పెద్దలకి తాంబూలం సమర్పించి, ఘృతయుక్తమైన పెసర పులగం నివేదన చేసి భుజించాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం జీవిస్తారు.


ప్రదోష కాలంలో ఇంటి ప్రధాన ద్వారం లేదా ప్రాంగణంలో యమ భగవానుని పేరుతో ఒక దీపాన్ని కూడా వెలిగించాలి. దీనితో పాటు, అధిష్టాన దేవతను పూజించేటప్పుడు స్వస్తిక, కలశ, నవగ్రహ దేవత, పంచ లోహాలు, షోడశ మాతృక మరియు సప్త మాతృకలను కూడా పూజించాలి.


Also Read: Mars Transit 2022: అక్టోబరులో కుజుడు రాశి మార్పు.. ఈ 2 రాశులవారికి వ్యాపారంలో లాభం, కెరీర్‌లో పురోగతి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook