Dhanteras Puja 2022: ధంతేరాస్ పండగ పూజ ముహూర్తం.. పూజ విధానం.. ఇలా చేస్తే ధనమే ధనం..
Dhanteras Puja 2022: లక్ష్మి దేవి పూజలో భాగంగా తప్పకుండా గణేషుని పూజ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింద్ర పేర్కొన్న మంత్రాన్ని తప్పకుండా పరాయనం చేయడం వల్ల కుటుంబంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి.
Dhanteras Puja 2022: ఈ రోజు హిందువులకు ఎంతో ప్రముఖ్యమైన రోజు. దేశ వ్యాప్తంగా ధన్‌తేరస్ పండగను జరుపుకుంటారు. దీపావళి ముందు రోజు ధన త్రయోదశి జరుపుకోవడం హిందువుల ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి అక్టోబర్ 24న సూర్యగ్రహణం ఉండడంతో చాలామందిలో సందేహం ఏర్పడింది. ధన త్రయోదశిని, దీపావళిని ఏయే తేదీల్లో జరుపుకోవాలో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. అయితే ఏ తేదీన జరుపుకుంటే మంచి ఫలితాలు పొందుతారు మనం ఎప్పుడు తెలుసుకోబోతున్నాం.
ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యం ఆరోగ్యం కీర్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి కలుగుతాయని హిందూ పురాణాలు చెబుతున్నారు. కాబట్టి రాత్రిపూట అందరూ వ్యాపార సంస్థల్లో దీపాలు వెలిగించి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు చాలామంది అమ్మవారి అనుగ్రహం పొందేందుకు ఉపవాసాలు కూడా పాటిస్తారు ఇంకొందరు అయితే భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. అయితే చాలామందికి పూజ చేసే క్రమంలో పలు తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఆ తప్పులను సరిదిద్దు ఎందుకు మనం ఇప్పుడు పూజా విధానాన్ని తెలుసుకోబోతున్నాను.
పూజ ముహూర్తాలు:
ధన్వంతరి పూజ ఉదయం ముహూర్తం - ఉదయం: 06.30 నుంచి 08.50 (22 అక్టోబర్ 2022)
ధన్తేరస్ పూజ ముహూర్తం రాత్రి 7.31 నుంచి 8.36
యమ దీపం ముహూర్తం రాత్రి 06.07నుంచి 07.22
ధంతేరాస్ 2022 ముహూర్తం:
బ్రహ్మ ముహూర్తం - ఉదయం: 04:51 నుంచి 05:41
అభిజిత్ ముహూర్తం - ఉదయం:11:56 నుంచి12:42
విజయ్ ముహూర్తం - మధ్యహ్నం 02:15 PM నుంచి 03:02
సంధ్య ముహూర్తం సంయంకాలం 06:07 నుంచి 06:32
అమృత్ కాలం ఉదయం: 07:05 నుంచి 08:46
నిశిత ముహూర్తం సయంత్రం 11:54 నుంచి 12:44 (అక్టోబర్ 23)
లక్ష్మీదేవి పూజ కార్యక్రమంలో తప్పకుండా వినాయకుని పూజ చేయాల్సి ఉంటుంది. పూజా క్రమంలో రాత్రిపూట లక్ష్మీదేవి విగ్రహంతో పాటు వినాయకుని విగ్రహాన్ని కూడా ప్రతిష్టించి నెయ్యితో దీపాలు వెలిగించాలి. పూజా కార్యక్రమంలో పాల్గొనేవారు ఎర్రని దుస్తులను ధరించి నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ మంత్రాన్ని చదవాలి: "వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా"
ఇక లక్ష్మీదేవి పూజా విషయానికొస్తే.. దీపావళి రోజున ధనత్రయోదశి రోజున పూజలో పాల్గొనేవారు తప్పకుండా ఉపవాసాలు పాటించాల్సి ఉంటుంది. అయితే పూజలో భాగంగా అమ్మవారికి పువ్వులు గంధంతో అలంకరించి.. తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
Also Read : Ori Devuda Vs Ginna : విశ్వక్ సేన్‌ను కూడా దాటని మంచు విష్ణు
Also Read : Actress Anjali Pavan : అమ్మ మాత్రమే.. నాన్న లేరు.. స్టేజ్ మీద ఏడిపించేసిన మొగలిరేకులు అంజలి పవన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook