Dhanu Sankranti 2023: రేపే ధను సంక్రాంతి.. ఈ 4 రాశుల వారికి కుబేర యోగం..
Sun transit 2023: రేపు గ్రహాల రాజు అయిన సూర్యుడు వృశ్చిక రాశిని విడిచిపెట్టి ధనస్సు రాశిలోకి వెళ్లనున్నాడు. దీనినే ధను సంక్రాంతి అంటారు. ఇది ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Dhanu Sankranti 2023 Benefits: ఆస్ట్రాలజీ ప్రకారం, దాదాపు 30 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తాడు సూర్యుడు. రేపు అంటే డిసెంబరు 16న సూర్యభగవానుడు వృశ్చిక రాశిని వదిలి ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే ధనుసంక్రాంతి అంటారు. విజయం మరియు గౌరవానికి కారకుడిగా భాస్కరుడిని భావిస్తారు. ధను సంక్రాంతి వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
ధనస్సు రాశి
ఇదే రాశిలో సూర్యుడు సంచరించబోతున్నాడు. దీంతో ఈ రాశి వారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మీరు ఫ్యామిలీ అండ్ ప్రెండ్స్ మంచి సమయం గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. మీరు ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది.
సింహరాశి
సింహరాశికి అధిపతి సూర్యుడు. అందుకే ఈ రాశి వారికి ధను సంక్రాంతి బోలెడు బెనిఫిట్స్ ను ఇస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు కెరీర్ లో ముందుకు సాగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి.
మేష రాశి
ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం వల్ల మేషరాశి వారు చాలా ప్రయోజనం పొందుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. విద్యార్థులు, పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు.
వృశ్చిక రాశి
Also Read: Weekly Horoscope: వచ్చే వారం ఈ 4 రాశుల వారు నక్క తోక తొక్కబోతున్నారు.. ఇక వీరికి డబ్బే డబ్బు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook