Diwali 2022 will be very auspicious for 6 zodiac signs: దేశ ప్రజలందరూ దీపావళి పండుగను ఈ ఏడాది అక్టోబర్ 24న జరుపుకోనున్నారు. దీపావళికి ఒక రోజు ముందు (అక్టోబర్ 23) మకర రాశిలో శని సంచరిస్తాడు. మరోవైపు అక్టోబర్ 26న బుధ గ్రహం తుల రాశిలో సంచరించనుంది. ఆ సమయంలో సూర్యుడు, శుక్రుడు, కేతువులు తుల రాశిలో ఉంటాయి. తుల రాశిలోని ఈ గ్రహాల ఉనికి కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా మారనుంది. దీపావళి తర్వాత వచ్చే బుధ సంచారం.. కొన్ని రాశుల వ్యక్తులపై ఉండనుంది. మహాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహంతో ఈ దీపావళి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏవోఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథున రాశి:
దీపావళి రెండు రోజుల తర్వాత తుల రాశిలో బుధుడు సంచరించడం వలన మిథున రాశి వారికి చాలా బాగుంటుంది. మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. కొన్ని శుభవార్తలను వింటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.


కర్కాటకం:
దీపావళి తర్వాత కర్కాటక రాశి వారికి ధనప్రాప్తి ఉంటుంది. మహాలక్ష్మి దయతో అతి పెద్ద పనిన సులభంగా పూర్తవుతుంది. అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.


సింహం:
బుధ సంచారం సింహ రాశి వారికి ధనాన్ని ఇస్తుంది. కొత్త ఉద్యోగంను పొందవచ్చు లేదా ప్రమోషన్ రావొచ్చు. మీరు అకస్మాత్తుగా డబ్బు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కుటుంబంతో మధుర క్షణాలను గడుపుతారు.


వృశ్చికం:
బుధ సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి భారీగా ఆదాయం పెరుగుతుంది. జీతం పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. విదేశాల్లో పనిచేసే వారికి ప్రయోజనం ఉంటుంది.


ధనుస్సు:
ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తగినంత డబ్బు చేతికి వస్తుంది. ఆగిపోయిన ధనం మీ చేతికి అందుతుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను వింటారు.


మకరం:
బుధ సంచారం మకర రాశి వారి కెరీర్‌కి ప్రయోజనాలను అందిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.


Also Read: నాకు మొగుడిని వెతికినందుకు థాంక్స్.. ఇంకా ఆ విషయాలు కూడా చెప్పండి: అనన్య నాగళ్ల


Also Read: ICC T20 WC 2022: అతడు లేకపోతే టీమిండియాకు కష్టమే..ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook