Diwali Dhanteras 2022: ఈ సంవత్సరం దీపావళి పండుగ రోజున ధంతేరస్ రోజున ప్రారంభం కాబోతోంది. అయితే ఈ క్రమంలో లక్ష్మిదేవిని పూజించండం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుంది. అయితే లక్ష్మిదేవిని 5 రోజుల పాటు లక్ష్మిదేవిని పూజిస్తే అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయని శాస్త్రం చెబుతోంది. దీపావళి రోజున పలు రకాల నియమాలు పాటించి పూజలు చేయడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఈ రోజున పలు నివారణాలు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది విలువ గల వస్తువులతో అమ్మవారికి పూజలు చేస్తారు. విలువైన వస్తువలనే కాకుండా కొత్తిమీర గింజలను ఉపయోగించి అమ్మవారి పూజిస్తే అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్య శాస్త్రంలో దీపావళి రోజున  కొత్తిమీరతో కొన్ని పరిహారాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిహారం చేయడం వల్ల మనిషి జీవితంలో సంతోషం, శాంతి కలుగుతుంది. అంతేకాకుండా  జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు కూడా లభిస్తుందని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ క్రమంలో మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ సందర్భంలో తప్పకుండా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు లక్ష్మి దేవిని పూజించాలి.


దీపావళి రోజున కొత్తిమీరతో ఈ రెమెడీస్ చేయండి:  


>>ధన్తేరస్ రోజున రాత్రి లక్ష్మీదేవి ముందు కొత్తి మీర గింజలను ఉంచి భక్తితో తో పూజించండి. ఆ తర్వాత వీటిని కుండలో వేసి ఆకు పచ్చని మొక్కలను అందులో నాటడం వల్ల కుటుంబంలో అన్ని మంచి జరుగుతాయి. ఇలా లక్ష్మిదేవిని పూజించడం వల్ల  ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమేకాకుండా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


>>దీపావళి రోజున కొత్తిమీర పరిహారం పాటిస్తే తప్పకుండా మీరు ధనవంతులుగా మారుతారు. అయితే లక్ష్మి పూజ చేసిన తర్వాత ఆ కుండలో ఉన్న కొత్తి మీర గింజలను శుక్ల పక్షం మంగళవారం రోజున ఆ కుండలో నాణేలను ఉంచి నీటిలో వదలడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఈ విత్తనాలను ఇంటికి ఉత్తరం వైపు అస్సలు ఉంచకూడదని నిపుణులు తెలుపుతున్నారు.


>>అంతేకాకుండా కొత్తిమీరను ఎర్రటి గుడ్డలో కట్టి.. ఆలయానికి వెళ్లి హనుమంతుడి ముందు పెట్టి పూజంచి ఈ క్రమంలో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి.


 >>ఆర్థిక పరిస్థితులు బాగాలేని వారు ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలనుకుంటే బుధవారం రోజు ఈ పూజించిన కొత్తి మీర గింజలను ఆవు తినిపించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్ని దూరమవుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: TSPSC Group-1: ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌... సివిల్స్ స్థాయిలో ప్రశ్నలు..!


Also Read: TSPSC Group-1: ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌... సివిల్స్ స్థాయిలో ప్రశ్నలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook