Diwali Muhurat 2023: సాయంత్రం లక్ష్మీ పూజలో భాగంగా ఈ 3 నియమాలు పాటిస్తే..జీవితాంతం ధన ప్రవాహమే..
Diwali Muhurat 2023: ప్రతి సంవత్సరం దీపావళి పండగ రోజున లక్ష్మీ అమ్మ వారితో పాటు విగ్నేశ్వరుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రోజు అమ్మవారిని పూజించే క్రమంలో ఈ క్రింది నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
Diwali Muhurat 2023: దీపావళి పండగ భారతీయులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ.. భారత్లో ఈ పండగను చాలా ప్రాంతాల్లో దీపాల పండుగగా కూడా పిలుస్తారు. ఈ పండగ రోజున శ్రీ మహాలక్ష్మితో పాటు విగ్నేశ్వరుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా చాలామంది మహిళలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు కూడా పాటిస్తారు. అయితే ఈ లక్ష్మీ పూజలో భాగంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన కొన్ని పద్ధతుల్లో చేయడం వల్ల ఇంట్లో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. ఏయే నియమాలతో దీపావళి రోజున లక్ష్మీదేవిని కొలవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తామర పువ్వు:
లక్ష్మీ అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ప్రీతికరమైనవి. కాబట్టి సాయంత్రం అమ్మవారి వ్రతాన్ని ఆచరించేవారు తప్పకుండా పూజలో భాగంగా తామర పువ్వులను పాదాల వద్ద సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించి సులభంగా ఆర్థిక సమస్యలు దూరమవుతాయని పురాణాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
పసుపు, గవ్వలు:
ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి దీపావళి రోజు లక్ష్మీ అమ్మవారి పూజలు భాగంగా పసుపు గవ్వలను సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా మీరు ఒక ఎర్రని కాటన్ చిన్న తువాలను తీసుకొని అందులో తెల్లని గవ్వలను ఉంచి వాటిపై పసుపుతో అలంకరించాలి. ఇలా అలంకరించిన గవ్వలను ముడుపులా కట్టి లక్ష్మీ అమ్మవారి పాదాల ముందు ఉంచాలి. ఆ తర్వాత మరుసటి రోజు ఈ ముడుపును తీసి మీరు చేస్తున్న పని ప్రదేశాల్లో పెట్టుకోవడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
కుబేరు యంత్రం:
దీపావళి రోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించే క్రమంలో కుబేర యంత్రాన్ని పూజించడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీ వ్యాపార ప్రదేశాల్లో దీపావళి రోజు సాయంత్రం పూట పూజించిన కుబేర యంత్రాన్ని మీరు కూర్చునే ప్రదేశాల్లో పెట్టుకోవడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ యంత్రాన్ని షాపులలో కూడా పెట్టుకోవచ్చు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook