Magha Pournami 2024: మాఘపూర్ణిమనాడు పొరపాటున ఈ 5 పనులు చేయకండి.. పితృదేవతలు శపిస్తారట..
Magha Pournami 2024: హిందూ మతం ప్రకారం మాఘపౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు స్నాన, దానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మాఘపూర్ణిమ శివకేశవులను పూజిస్తారు. ఈరోజు మనం చేసే కొన్ని చర్యలు మన పూర్వజన్మల పాపాలను కూడా తొలగిస్తాయి.
Magha Pournami 2024: హిందూ మతం ప్రకారం మాఘపౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు స్నాన, దానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మాఘపూర్ణిమ శివకేశవులను పూజిస్తారు. ఈరోజు మనం చేసే కొన్ని చర్యలు మన పూర్వజన్మల పాపాలను కూడా తొలగిస్తాయి. అంతేకాదు, పితృదేవతల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. మాఘపౌర్ణమి ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 24న రానుంది. అయితే మాఘపౌర్ణమిరోజు కొన్ని పనులు చేయకూడదు. లేదంటే మీ పితృదేవతలకు విపరీతమైన కోపం వస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
మాఘపౌర్ణమి రోజు పెద్దవారిని అస్సలు దూషించకూడదు. ముఖ్యంగా ఎవరితోనూ విరోధం పెట్టుకోకండి.
ఈరోజు బ్రహ్మముహూర్తంలో ఉదయమే స్నానం చేయాలి. మాఘపౌర్ణమి రోజు దానానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది.
నల్లని వస్త్రాలు ఈరోజు ధరించకూడదు. జోతిష్య శాస్త్రం ప్రకారం మాఘపౌర్ణమిరోజు ఇలాంటి వస్త్రాలు ధరించడం వల్ల నెగిటివిటీ పెరిగిపోతుంది.
ఇదీ చదవండి: ఈ ఒక్క శివలింగ దర్శనం 12 తీర్థాల పుణ్యాన్ని ఇస్తుంది.. ఎక్కడుందో తెలుసా?
మాఘపౌర్ణమి రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. మద్యమాంసాలకు దూరంగా ఉండాలి. లేదంటే పితృదేవతలకు కోపం వస్తుందట.
ముఖ్యంగా ఈరోజున జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. ఇది కూడా పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది. లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది.
ఇదీ చదవండి: సమ్మక్క సారక్కకు బెల్లం ఎందుకు సమర్పిస్తారంటే..?
అంతేకాదు మాఘపౌర్ణమి రోజు బ్రాహ్మచర్యం పాటించాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter