Broom vastu Tips in Telugu: చీపురును లక్ష్మీదేవిగా పరిగణిస్తారు హిందూమతం ఆచరించేవారు. వాస్తులో చీపురుకు ప్రత్యేక స్థానం ఉంది. చీపురు ఇంట్లో పెట్టే దిశకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే, చీపురు తప్పుడు దిశలో పెట్టుకుంటే దరిద్రం తప్పదంటున్నారు వాస్తు నిపుణులు.. అంతేకాదు సాయంత్రం దీపాలు వెలిగించిన తర్వాత చీపురుతో ఇల్లు ఊడ్చకూడదని అంటారు. దీంతో ధననష్టం వాటిల్లుతుంది. పొరపాటున కూడా చీపురును కాళితో తొక్కకూడదు అని మన పెద్దలు కూడా చెబుతారు.సాధారణంగా ప్రతి ఇంటిలో చీపురు ఉంటుంది. ముఖ్యంగా చీపురు లేకుండా ఏ ఇంటినీ శుభ్రం చేయలేం. ఇంట్లోని చెత్తను బయటకు పారదోలడానికి చీపురును ఉపయోగిస్తారు.ఇది లేకుండా పనే కాదు. అయితే, చీపురుతో పని అయిపోయిన తర్వాత చాలామంది దాన్ని అడ్డదిడ్డంగా పెడతారు. వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకోవడం మాత్రమే కాదు, ఇంట్లోని వస్తువులు కూడా వాస్తు ప్రకారం అమర్చుకోవాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు,వంటగది శుభ్రత అనేది ఇంటి శక్తిని ప్రభావితం చేసే ముఖ్యమైన భాగం. వంటగదిలో మనం ఆహారాన్ని వండుతాం. అక్కడ పరిశుభ్రతను పాటిస్తాం. అయితే, మీరు చీపురును వంటగదిలో ఉంచకూడదు. దీన్ని వాస్తు ప్రకారం సరైన ప్రదేశంలో ఉంచాలి. సాధారణంగా కొంతమందికి జ్యోతిష్యంపై నమ్మకం ఉండదు. కానీ,  సైన్స్ ప్రకారం చీపురు ఇంటిని శుభ్రపరిచే సాధనం. ఈ చీపురు ద్వారా చాలా బ్యాక్టీరియా మీ వంటగదిలోకి ప్రవేశించవచ్చు. చీపురుకు ఉన్న బ్యాక్టీరియా ఆహారంలోకి ప్రవేశించి కలుషితమవుతుంది. వాస్తు ప్రకారం కూడా చీపురును సరైన దిశలో పెడితే ఇంట్లోకి లక్ష్మీ ప్రవేశిస్తుంది. కాకుండా తప్పుడు దిశలో ఏర్పాటు చేసుకుంటే దరిద్రం చుట్టుకుంటుంది. 


ఇదీ చదవండి: తులసిమొక్క వద్ద పొరపాటున కూడా ఈ 5 పెట్టకండి.. ఆ ఇంట ఎప్పుడూ ఆర్థికసమస్యలేనట..


మీరు ఎప్పుడైనా కొత్త చీపురును కొనుగోలు చేయాల్సి వస్తే శనివారం మార్చాలి. కొన్ని ప్రత్యేక దినాలు అంటే దీపావళి, ధంతేరాస్ సమయంలో చీపురును ఏదైనా దేవాలయాలకు దానం చేస్తే ఆ వ్యక్తి అదృష్టమే మారిపోతుంది. వృత్తివ్యాపారాల్లో విజయం సాధిస్తారు.  అంతేకాదు కలలో చీపురు కనిపిస్తే కూడా చాలామంచిది. ఎందుకంటే చీపురు లక్షీదేవికి ప్రతీక. ఇలా మీకు కలలో చీపురు కనిపిస్తే ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది. అయితే, పొరపాటున కూడా ఇంటి ఈశాన్యదిశలో చీపురును పెట్టకూడదు. దీంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారు.ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు, లేదా బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు చీపురును నేరుగా కనిపించేలా పెట్టకూడదు.


ఇదీ చదవండి: తిరుమల తిరుపతి వేంకటేశుని దర్శనానికి రూ.300 టిక్కెట్ లేదా? అయితే ఇలా సులభంగా దర్శించుకోండి..


పైగా చీపురును ఎప్పుడు నిలబెట్టకూడదు. అంతేకాదు చీపురును వంటిల్లు లేదా బెడ్ రూంలో కూడా పెట్టకూడదు. ఇది కాకుండా వ్యతిరేక దిశలో చీపురును పెడితే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter