Ganesh Chaturthi 2022: జ్ఞానం, ఆనందం మరియు శ్రేయస్సుకి కారుకుడు వినాయకుడు. మరో పది రోజుల్లో వినాయక చవితి రానుంది. దీనినే గణేష్ చతుర్థి (Ganesh Chaturthi 2022) అని కూడా అంటారు. ఈ రోజున గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించి పూజిస్తారు. ఏ శుభకార్యం తలపెట్టాలన్నా, పూజ చేయాలన్నా ముందుగా వినాయకుడిని  పూజిస్తారు. వినాయక చవితి నాడు గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు ఇష్టమైన వస్తువులు సమర్పిస్తారు. ఆరోజున నుదుటిపై ఎర్ర సింధూరం ఎందుకు రాసుకుంటారు, దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పురాణాల ప్రకారం, వినాయకుడు తన చిన్నతనంలో సిందూర్ అనే రాక్షసుడిని చంపి అతని రక్తాన్ని అతని శరీరంపై పోశాడు. అప్పటి నుంచి గణపతికి ఎర్రటి సింధూరం (Vermilion) అంటే ఇష్టమట. వినాయకుడి కుంకుమ పెడితే ఆ దేవుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా మీరు అనుకున్న పని జరుగుతుంది. 
గణేశుడికి కుంకుమ నైవేద్యంగా పెడితే ఆ వ్యక్తికి శాంతి, సౌభాగ్యం లభిస్తాయని చెబుతారు. అంతేకాకుండా త్వరగా పెళ్లి కూడా అవుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వినాయకుడికి కుంకుమ పెడితే శుభవార్త వింటారు.  ఉద్యోగానికి లేదా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ పని చేయండి చాలు. 


ఉదయాన్నే స్నానం చేసి మంచి బట్టలు ధరించండి. అనంతరం గణేశుడిని పూజించండి. ఆయన ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఎర్రటి పువ్వులు, దుర్వా గడ్డిని సమర్పించండి. తర్వాత గణేశుడికి కుంకుమ పెట్టండి. నైవేద్యంగా లడ్డూలను పెట్టండి.  వినాయక చవితి నాడు గణపతిని 21 రకాల పత్రాలతో పూజిస్తారు.


గణేశ మంత్రం 
సింధూరం శోభనం రక్తం సౌభాగ్యం సుఖవర్ధనమ్ ।
శుభం కమదం చైవ సింధూరం ప్రతిజ్ఞాతమ్...


Also Read: Budh Gochar 2022: కన్యా రాశిలో బుధుడి సంచారం... ఏ రాశివారికి లాభం? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook