Lotus in Dream: మనం నిద్రలో రోజూ ఎన్నో కలలు ఉంటాం. ఇవీ మంచైనా కావచ్చు లేదా చెడు అయినా కావచ్చు. ఈ డ్రీమ్స్ లో కొన్ని మాత్రమే ఉదయం నిద్రలేచి సరికి గుర్తు ఉంటాయి. స్వప్నశాస్త్రం ప్రకారం, ప్రతి కలకి అర్థం ఉంటుంది. ఈ డ్రీమ్స్ మీ ప్యూచర్ కు సంబంధించి కొన్ని సూచనలు చేస్తాయి. కలలో కొన్ని వస్తువులు కనిపించడం శుభప్రదంగా భావిస్తారు.  ఈ రోజు మనం అలాంటి పువ్వు గురించి తెలుసుకుందాం. ఇది కలలో కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. డ్రీమ్ లో తామరపువ్వు (Lotus in Dream) కనిపిస్తే ప్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వప్నశాస్త్రం ప్రకారం, కలలో తామర పువ్వును చూడటం చాలా మంచిదని భావిస్తారు. ఇది భవిష్యత్తుకు మంచి సంకేతం. ఎవరైనా కలలో తామర పువ్వును చూసినట్లయితే, అతను త్వరలో ధనవంతుడు కాబోతున్నాడని అర్థం. అతనికి కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. ఇరుక్కుపోయినా డబ్బు తిరిగి వస్తుంది.  మరో కోణంలో చూస్తే..లోటస్ డ్రీమ్ లో కనిపించడం అనేది జ్ఞాన సాధనకు మార్గంగా పరిగణిస్తారు. కలలో పువ్వులు చూడమంటే... ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్న మాటే. అనారోగ్యంగా ఉన్న వ్యక్తి తన కలలో తామర పువ్వును చూస్తే.. అతను త్వరలో వ్యాధుల నుండి బయటపడబోతున్నాడని అర్థం. 


Also Read: Sarva Pitru Amavasya 2022: సర్వ పితృ అమావాస్య ఎప్పుడు, శుభ సమయం, ప్రాముఖ్యత 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook