Dreams Interpretation: మీకు కలలో కుక్కలు కన్పిస్తున్నాయా..అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే
Dreams Interpretation: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యా శాస్త్రాలకున్నట్టే స్వప్న శాస్త్రానికి కూడా ప్రాధాన్యత ఉంది. స్వప్నశాస్త్రం ప్రకారం మీకు వచ్చే ప్రతికలకూ సంబంధముంటుంది. మీకు కలలో కుక్కలు కన్పిస్తుంటే..దానర్ధం ఏంటి..
Dreams Interpretation: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యా శాస్త్రాలకున్నట్టే స్వప్న శాస్త్రానికి కూడా ప్రాధాన్యత ఉంది. స్వప్నశాస్త్రం ప్రకారం మీకు వచ్చే ప్రతికలకూ సంబంధముంటుంది. మీకు కలలో కుక్కలు కన్పిస్తుంటే..దానర్ధం ఏంటి..
హిందూమతం ప్రకారం స్వప్నశాస్త్రం చాలా ప్రాముఖ్యత కలిగింది. నిద్రలో వచ్చే కలలకు స్వప్నశాస్త్రం అర్ధాలు వివరిస్తుంది. చాలామంది రాత్రి నిద్రలో వచ్చే కలలకు అర్ధమేంటో తెలియక సతమతమౌతుంటారు. నిద్రలో వచ్చే కలల వెనుక కారణాలేంటి, ఏం సంకేతాలిస్తున్నాయనేది తెలుసుకోవాలి. స్వప్నశాస్త్రంలో వీటి గురించి వివరంగా ఉంటుంది.
చాలా సార్లు రాత్రి నిద్రలో వచ్చే కలల్ని ఉదయం లేవగానే మర్చిపోతుంటాం. కొన్ని కలలు మాత్రం మర్చిపోం సరికదా..వాటి గురించే ఆలోచిస్తుంటాం. వాటి అర్ధం తెలియక, ఆ కలలు దేనిని సూచిస్తున్నాయో తెలియక సందిగ్దంలో పడుతుంటాం. స్వప్నశాస్త్రం ప్రకారమైతే ప్రతి కలకూ ఓ అర్ధముంటుంది. సంకేతముంటుంది. ప్రతి కల ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తోందని అర్దం చేసుకోవాలి. ఒకవేళ మీకు కలలో కుక్కలు కన్పిస్తే అప్రమత్తం కావాలని అర్ధం. ఎందుకంటే దానివెనుక బలమైన కారణమే ఉంది. ఆ కారణాలేంటో చూద్దాం..
1. ఒకవేళ మీకు కలలో ఏడుస్తున్న కుక్కలు కన్పిస్తే..అప్రమత్తం కావల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు బ్యాడ్‌న్యూస్ వస్తుందని ఈ కలకు అర్ధం. ఇలాంటి కల అశుభానికి సూచకం.
2. నిద్రలో కుక్క కర్చినట్టు కల వస్తే..అది శుభ సంకేతం. దీనర్ధం. మీకు త్వరలో శుభవార్త వింటారని అర్ధం. మీరు ఏదైనా సమస్యలో లేదా ఇబ్బందిలో చిక్కుకుని ఉంటే..త్వరలో ఆ సమస్య నుంచి విముక్తి పొందుతారని అర్ధం.
3. ఒకవేళ మీకు కలలో కోపంతో ఉన్న కుక్కలు కన్పిస్తే..అది అశుభ సూచకం. స్వప్నశాస్త్రం ప్రకారం ఈ కలకు అర్ధం..మీకు నమ్మకమైన వ్యక్తి మోసం చేయనున్నాడని అర్ధం. ఇలాంటి కల వచ్చినప్పుడు అప్రమత్తం కావాలి.
4. ఒకవేళ కలలో మీకు కుక్కలు ఎంజాయ్ చేస్తూ కన్పిస్తే..లేదా ఆడుతూ కన్పిస్తే శుభ సంకేతం. దీనర్ధం మీరు పాత మిత్రుడిని కలుస్తున్నారని అర్ధం.
5. కలలో కుక్క ..పిల్లి వెంటపడుతున్నట్టుగా వస్తే..స్వప్నశాస్త్రం ప్రకారం అశుభ సూచకం. దీనర్ధం ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో నిరాశ ఎదురౌతుందని అర్ధం చేసుకోవాలి.
Also read: Varalakshm Vratham 2022: వరలక్ష్మి వ్రతం ఎప్పుడు, పూజా విధానం, సమయం, తేదీ ఎప్పుడు, ప్రాముఖ్యతేంటి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook