Dreams Meaning in Telugu: ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. కొందరు ఆ కలలే నిజాలైతే బాగుండని అనుకుంటారు. మరికొందరు ఇలాంటి పీడకలలు మళ్లీ రావద్దని అనుకుంటారు. మన ఆలోచనలు.. రోజువారీ జీవితంలో మనం చూసిన అంశాలే చాలా వరకు కలలోకి వస్తుంటాయి. భవిష్యత్‌లో చేయబోయే విషయాల గురించి మనం పదేపదే ఆలోచించినా.. రాత్రికి కల రూపంలో మనల్ని పలకరిస్తాయి. అయితే ఎక్కువ శాతం కలలు ఉదయం లేచిన కాసేపటికే మర్చిపోతాం. మరికొందరికి ఒకే కల పదే పదే వస్తుంటుంది. ఒకే వ్యక్తి ఎక్కువసార్లు కూడా కలలోకి రావచ్చు. నిద్రలో వచ్చే కలలు నిజ జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపుతాయనే విషయం అందరికీ తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనకు రోజు వచ్చే కలల గురించి స్వప్న శాస్త్రంలో వివరంగా రాశారు. నిద్రలో వచ్చే కలలు మన జీవితంలో రాబోయే మంచి.. చెడు రోజులను సూచిస్తాయని డ్రీమ్ సైన్స్ నిపుణులు చెబుతున్నారు. కొంతమంది అమ్మాయిలకు తమ కలలో ఒక యువకుడిని పదేపదే వస్తుంటాడు. ఏంటి ఈ అబ్బాయి ఇలా కలలోకి వస్తున్నాడని అమ్మాయిలు భయపడుతుంటారు. ఒక అమ్మాయి కలలో ఒక యువకుడు మళ్లీ మళ్లీ వస్తున్నాడంటే.. ఆమె అతని గురించి గురించి ఎక్కువగా ఆలోచిస్తుందని అర్థం. ఇది శుభసూచకమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా కలలో వస్తున్న అబ్బాయితో భవిష్యత్‌లో ఎక్కువ ఫ్రెండ్‌షిప్ చేయబోతున్నారని అర్థమని చెబుతున్నారు.


అదేవిధంగా అమ్మాయిలకు తమ ఒడిలో చిన్న పిల్లాడు ఆడుకునే కలలో కూడా వస్తుంటాయి. ఒక అమ్మాయికి అలాంటి కలని వస్తే.. ఆ అమ్మాయి సంపద, వ్యాపారం విపరీతంగా పెరుగుతుందని అర్థమని నిపుణులు అంటున్నారు. చిన్న పిల్లవాడు ఒడిలో ఆడుకోవడం అభ్యుదయానికి చిహ్నం అని చెబుతున్నారు. ఇది కుటుంబం చెడు రోజులు ముగిసిపోయాయనేందుకు గుర్తు అని అంటున్నారు. ఇక చాలామంది అమ్మాయిలు తమ కలలో బాయ్‌ఫ్రెండ్‌ను చూస్తుంటారు. తమలోని అపారమైన ప్రేమ భావాలను అణచివేయడానికి అమ్మాయి ప్రయత్నిస్తే.. అలాంటి కలలు వస్తాయని శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ప్రేమ మాటల్లో చెప్పనంత వరకు ఇలాంటి కలలు వస్తూనే ఉంటాయని చెబుతున్నారు. 


(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Amit Shah: కేసీఆర్ నీ కొడుకు సీఎం అయ్యే ప్రసక్తే లేదు.. నిప్పులు చెరిగిన అమిత్‌ షా


Also Read: Pakistan ODI Rank: వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌ టీమ్‌గా పాకిస్థాన్.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook