Jupiter Transit: డిసెంబర్ నెల మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సంవత్సరంలోని డిసెంబర్ నెల చివరి నెల కావడంతో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా ఎంతో ప్రాముఖ్యత కలిగిన గురుగ్రహం డిసెంబర్ 31వ తేదీ రాశి సంచారం చేయబోతోంది. డిసెంబర్ 31వ తేదీన ఉదయం ఏడు గంటలకు బృహస్పతి గ్రహం రాశిని మార్చుకోబోతోంది. దీని కారణంగా గజలక్ష్మి రాజయోగ ఏర్పడబోతోంది అని చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ఈ గజలక్ష్మి రాజయోగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. యోగం కారణంగా కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పుల కారణంగా ఊహించని లాభాలతో పాటు కొన్ని రాశుల వారు ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ గజలక్ష్మి రాజయోగం ఏర్పడడం కారణంగా ఏయే రాసిన వారికి అదృష్టం రెట్టింపు అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గజలక్ష్మి రాజయోగం కారణంగా ధనస్సు రాశి వారు ఊహించని లాభాలు పొందుతారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఈ రాశి వారు వ్యాపారాల్లో రెట్టింపు లాభాలు పొందుతారు దీంతోపాటు వ్యక్తిగత జీవితంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఉత్సాహం పెరిగి అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. ఇక ఎప్పటినుంచో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఈ యోగం కారణంగా ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి మంచి లాభాలు పొందుతారు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


బుధుడి సంచారం కారణంగా కర్కాటక రాశివారికి చాలా శుభప్రదంగా ఉటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఏర్పడే ప్రత్యేక రాజ యోగం కారణంగా ఈ రాశివారు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు మీ పిల్లల నుంచి కూడా మంచి శుభవార్తలు వింటారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఇది సరైన సమయం. ఈ సమయంలో ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించి శుభప్రదంగానే ఉంటుంది. దీంతో పాటు అన్ని రంగాల్లో పనులు చేసేవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.  


గజలక్ష్మి రాజయోగం ప్రభావం సింహ రాశివారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా ఈ రాశివారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వీరిపై వీరికి విశ్వాసం పెరిగి ఎలాంటి పనుల్లోనై విజయాలు సులభంగా సాధిస్తారు. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురవుతున్న సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో శరీరం కూడా చాలా యాక్టివ్‌గా మారుతుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి