Budhaditya Yoga 2023: బుధాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు..వీరికి ఇదే ది బెస్ట్ టైమ్!
Budhaditya Yoga 2023: బుధాదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారిపై స్పెషల్ ఎఫెక్ట్ పడబోతోంది. దీని కారణంగా ఊహించని లాభాలు పొందడమే కాకుండా అదృష్టం రెట్టింపు అవుతుంది. ఇక వ్యాపారాలు చేసే వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
Budhaditya Yoga 2023: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు కలయికకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒకే రాశిలో కొన్ని ప్రత్యేక గ్రహాలు కలవడం కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడతాయి. అయితే గ్రహాలకు రాకుమారుడు, అన్ని గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు తులా రాశిలో సంచారం చెయ్యబోతున్నాయి దీని కారణంగా బుధాదిపత్య యోగం ఏర్పడబోతోంది. యోగం కారణంగా 12 రాశుల వారి జీవితాల్లో మార్పులు సంభవించబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
బుధుడు నవంబర్ 6వ తేదీన తులా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇదే సమయంలో సూర్యుడు కూడా సంచారం చేయనున్నాడు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని ప్రత్యేక రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో వారికి ప్రయోజనాలతో పాటు అదృష్టం కూడా రెట్టింపు కాబోతోంది. అయితే ఈ సమయంలో రాజయోగం ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మిధున రాశి:
సూర్య, బుద్ధుడి గ్రహాల కలయిక కారణంగా మిధున రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో భౌతిక సుఖం లభించడమే కాకుండా కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. దీంతోపాటు మీ తల్లితో అనుబంధం మరింత మెరుగు పడుతుంది. జీవితంలో కూడా అనేక రకాల సానుకూల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కొత్త వాహనాలతో పాటు ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
సింహరాశి:
ఈ బుధాదిత్య రాజయోగం వల్ల సింహ రాశి వారికి ఆర్థిక అంశాల్లో శ్రేయస్కరంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి అదృష్టం వరించి మీ భాగస్వాములతో ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రసంగాలు చేయడం కారణంగా వ్యక్తులు మీకు ఆకర్షితులవుతారు. ఈ సింహ రాశి వారు కుటుంబంతో కూడా సరదాగా గడుపుతారు.
ధనస్సు రాశి:
బుధాదిత్య యోగం కారణంగా ధనస్సు రాశి వారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వ్యాపారాలు చేసే వారికి కొత్త ఆఫర్లు రావడమే కాకుండా.. భాగస్వాముల నుంచి ఊహించని లాభాలు పొందుతారు. ఇక రాజకీయ రంగంలో విశేష సేవలు అందిస్తున్న వారికి విజయం మీ వెంటే ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కూడా ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook