COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jupiter Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో గురు సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంటుంది. ఈ గ్రహాన్ని సంతోషం, శ్రేయస్సు, సంతానం, వివాహానికి కారకునిగా పరిగణిస్తారు. అంతేకాకుండా అదృష్ట గ్రహంగా కూడా పిలుస్తారు. అయితే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల వ్యక్తుల జాతకాల్లో మార్పులు వచ్చి జీవితంలో ఆనందం, సంపద పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 2024 సంవత్సరంలో మే 1వ తేదీ మధ్యాహ్నం 1:50 గంటలకు గురు గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఈ గురు గ్రహం కారణంగా ఏయే రాశులు ప్రభావితమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.  


ఈ రాశులవారిపై గురు గ్రహ ప్రభావం:
కన్యా రాశి:

2024లో బృహస్పతి చేయబోయే రాశి సంచారం కారణంగా కన్య రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారికి తొమ్మిదవ స్థానంలో సంచారం జరగబోతోంది. కాబట్టి వీరికి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఎవైన కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ రాశివారికి ఆనదం, సంపద కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


సింహ రాశి:
వచ్చే ఏడాది వృషభరాశిలో బృహస్పతి సంచారం చేయడం సింహ రాశి వారికి ఫలప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి బాస్‌ మద్దతు లభించి ప్రమోషన్స్‌ కూడా పొందుతారు. ఇక ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. 


మకర రాశి:
2024 సంవత్సరంలో జరగబోయే గురుగ్రహం సంచారం కారణంగా మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాల్లో కూడా చాలా రకాల మార్పులు వస్తాయి. వ్యాపారాలు చేసేవారికి కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అయితే ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా తలెత్తే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. మీ భాగస్వామి సహాయంతో సులభంగా పరిష్కరమవుతాయని జ్యోతిస్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook